తోటి దర్శకులకు స్ఫూర్తినిచ్చే సొంత గొంతుక.. వంగాపై ఆదిత్యాధర్ ప్రశంసలు!
సందీప్ రెడ్డి వంగా ఏం చెప్పాలనుకున్నారో దానిని సూటిగా చెప్పేస్తారు. అది తెరపై అయినా, లేదా వ్యక్తిగతంగా అయినా.. తాను నమ్మేదానిని ముక్కుసూటిగా చెబుతారు.;
సందీప్ రెడ్డి వంగా ఏం చెప్పాలనుకున్నారో దానిని సూటిగా చెప్పేస్తారు. అది తెరపై అయినా, లేదా వ్యక్తిగతంగా అయినా.. తాను నమ్మేదానిని ముక్కుసూటిగా చెబుతారు. ఎవరో ఏదో అనుకుంటారని ఆయన సందేహించరు. వంగాలోని ఈ యాటిట్యూడ్ ని ఒక హీరోలా చూస్తారు ఫ్యాన్స్. ఇప్పుడు అదే లక్షణం దురంధర్ దర్శకుడు ఆదిత్యాధర్ కి స్ఫూర్తినిచ్చింది. ఆయనే స్వయంగా దీనిని వెల్లడించారు. వంగా ఇతర దర్శకులకు సొంత గొంతు వినిపించేలా స్ఫూర్తినిస్తారని ఆదిత్యాధర్ వ్యాఖ్యానించారు.
భారతీయ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఏ విషయాన్నైనా సూటిగా, ముక్కుసూటిగా చెప్పడంలో సిద్ధహస్తుడు. అది వెండితెరపై కథాంశమైనా లేదా వ్యక్తిగత అభిప్రాయమైనా తాను నమ్మిన దానిని నిర్భయంగా చెప్పడం ఆయన నైజం. తాజాగా `ధురంధర్ 2` సినిమా విషయంలో ఆయన స్పందించిన తీరు, దానికి ఆ చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ ఇచ్చిన కౌంటర్ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇద్దరు మేకర్ల మధ్య కుదిరిన ఈ `సోదరభావం` సినీ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది.
హైదరాబాద్‌లోని ఒక థియేటర్లో రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి సందీప్ వంగా `ధురంధర్ 2`చిత్రాన్ని వీక్షించారు. ప్రభాస్- వంగా కలిసి సినిమా చూస్తున్న వీడియోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ను చూసిన తర్వాత వంగా చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఆదిత్య ధర్ మేకింగ్‌ను కొనియాడటమే కాకుండా ఈ సినిమాను `ప్రచార చిత్రం` (ప్రొపగండా) అని విమర్శించే వారిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
సందీప్ వంగా చేసిన ప్రశంసలకు ఆదిత్య ధర్ ఎంతో భావోద్వేగంతో ప్రతిస్పందించారు. ``మై డియర్ సందీప్.. మీరు మీ అభిప్రాయాలను సమర్థించుకునే తీరు..నిజాయితీ నాకు ఎంతో ఇష్టం. మీ సినిమా వెనుక మీరు చూపే ఆ దృఢమైన నమ్మకం మా వంటి తోటి దర్శకులకు తమ సొంత గొంతుకను నమ్మాలనే స్ఫూర్తినిస్తుంది! అంటూ ఆదిత్య ధర్ పేర్కొన్నారు. వీరిద్దరి మధ్య కుదిరిన ఈ పరస్పర గౌరవం పరిశ్రమలో ఒక కొత్త `బ్రదర్‌హుడ్`కు నాంది పలికిందని విశ్లేషకులు భావిస్తున్నారు. తన సందేశంలో ఆదిత్య `లెజెండ్` ప్రభాస్‌కు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
దురంధర్ 2 సినిమాపై వస్తున్న విమర్శలను సందీప్ వంగా తీవ్రంగా ఖండించారు. గతంలో అనేకమంది ప్రోపగాండాతో తమ కెరీర్లను నిర్మించుకున్నప్పుడు మౌనంగా ఉన్న సినీ పరిశ్రమ ఇప్పుడు ఈ సినిమాను విమర్శించడం వింతగా ఉందని ఆయన మండిపడ్డారు. నిజం ఎప్పటి నుండి ప్రోపగాండాగా మారిందో అర్థం కావడం లేదు! అని ఆవేదన వ్యక్తం చేస్తూనే... మొదటి ప్రయత్నం చేసిన వారిపై ఎగతాళి చేసే వారికి `లిబరల్స్` అని పిలుచుకునే అర్హత లేదని వంగా ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఆదిత్య ధర్ - రణవీర్ సింగ్‌లను ఉద్దేశించి వంగా ఇచ్చిన సలహా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాపై పడ్డ దిష్ఠి కన్ను అంత సులభంగా పోదని.. కేవలం గుప్పెడు మిరపకాయలతో దిష్టి తీస్తే సరిపోదని.. ఏకంగా పొలాన్నే తగలబెట్టాలి! అంటూ తనదైన స్టైల్‌లో కితాబిచ్చారు. మార్చి 19న విడుదలైన దురంధర్ 2 చిత్రంలో రణవీర్ సింగ్‌తో పాటు మాధవన్, సంజయ్ దత్ తదితరులు నటించారు.