సాయి పల్లవి 20 కోట్లు అందుకుంటుందా?
టాలీవుడ్, కోలీవుడ్ తనదైన సహజ నటనతో..డాన్సులతో ప్రేక్షకులను అలరించిన సాయి పల్లవి క్రేజ్ గురించిచ చెప్పాల్సిన పనిలేదు.
టాలీవుడ్, కోలీవుడ్ తనదైన సహజ నటనతో..డాన్సులతో ప్రేక్షకులను అలరించిన సాయి పల్లవి క్రేజ్ గురించిచ చెప్పాల్సిన పనిలేదు. తాను రిజెక్ట్ చేసిన సినిమాలున్నాయి..సినిమాలు రిజెక్ట్ చేసిన సాయి పల్లవి లేదు. వైవిథ్యమైన పాత్రలు..ప్రయోగాలతో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ను కోరుకుంది. నటన అన్నది డబ్బు కోసం కాదని...పేరు కోసం...ప్రతిష్టల కోసం అన్నది సాయి పల్లవిని చూస్తే చాలా మంది నటీమణులకు అర్దమవుతుంది. అమ్మడిలో ఆ రేర్ క్వాలిటీస్ బాలీవుడ్ లో `రామాయణం`లో అవకాశం సైతం కల్పించిందన్నది అంతే వాస్తవం.
కోలీవుడ్ లో శివ కార్తికేయన్ సరసన నటించిన `అమరన్` ఘనవిజయం తర్వాత ఆమె రేంజ్ ఒక్కసారిగా ఆకాశన్నంటింది. దీంతో రెండు భాషల్లో చాలా అవకాశాలు వచ్చాయి. కోట్ల రూపాయల పారితోసికం ఇవ్వడానికి నిర్మాతలు సిద్దపడ్డారు. కానీ తాను సినిమా చేయాలంటే? ఇవ్వాల్సింది డబ్బు కాదు. బలమైన పాత్ర ఇన మరోసారి రుజువు చేసింది. సరిగ్గా అదేస మయంలో నితీష్ తివారి రామాయణం స్క్రిప్ట్ తో అప్రోచ్ అవ్వడం.. అందులో సీత పాత్ర నచ్చడంతో సాయి పల్లవి మరో మాట లేకుండా కమిట్ అయింది. మరి ఈ సినిమాకు అమ్మడు ఎంత పారితోషికం తీసుకుంటుంది? అన్నది ఇంత వరకూ ఎక్కడా లీక్ అవ్వలేదు.
సీత పాత్ర కావడంతో చర్చంతా ఆ పాత్ర చుట్టూనే తిరిగింది తప్ప సంవత్సరాలు పాటు సమయాన్ని కేటాయిస్తుంది? ఎంత ఛార్జ్ చేస్తుంది? అన్నది తెరపైకి రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ విషయాలు లీక్ అవుతున్నాయి. `రామాయణ` రెండు భాగాల కోసం సాయి పల్లవి ఏకంగా 20 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే భారీ పారితోషికం .. సినిమా ఎంపిక వెనుక భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. `రామాయణం` లాంటి గ్లోబల్ ప్రాజెక్ట్‌లో సీత పాత్రను పోషిస్తున్నప్పుడు ఆ పాత్రకు ఉండే పవిత్రత .. ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ స్వయంగా ఆమెకు భారీ రెమ్యూనరేషన్‌ను ఆఫర్ చేశారా? లేక రామాయణం షూటింగ్ పూర్తయ్యే వరకు వేరే సినిమాలకు కమిట్ కాకూడదని సాయి పల్లవే నిర్ణయించుకున్నారా అనే స్పష్టత లేదు.
సాయి పల్లవి కమర్షియల్ హంగుల కంటే కూడా కథాబలం ఉన్న పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒకే సమయంలో పలు ప్రాజెక్ట్‌లలో నటించడం కంటే ఒక్కో సినిమాపై పూర్తి సమయం, ఏకాగ్రత పెట్టడం ఆమె నైజం. `రామాయణం` వంటి పౌరాణిక చిత్రానికి అవసరమైన లుక్, బాడీ లాంగ్వేజ్ .. మానసిక సిద్ధత కోసం ఆమె పూర్తిగా ప్రాజెక్ట్‌కే అంకితమైందన్నది ఓ వెర్షన్. మరోవైపు ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రాల మేకర్స్ ప్రధాన నటీనటులు ఇతర ప్రాజెక్ట్‌ల వల్ల బిజీగా మారి డేట్స్ సర్దుబాటు చేయలేకపోవచ్చనే ఉద్దేశంతో ఎక్స్‌క్లూజివ్ అగ్రిమెంట్లు చేసు కుంటుంటారు. ఈ క్రమంలోనే సాయి పల్లవి కూడా రామాయణం షూటింగ్ పూర్తయ్యే వరకు వేరే సినిమాలను అంగీకరించవద్దనే నిబంధనకు కట్టుబడి ఉందన్నది మరో వెర్షన్.
ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి కోలీవుడ్, టాలీవుడ్‌లలో కోట్లాది రూపాయల విలువైన పలు ఆఫర్లను వదులుకోవాల్సి వచ్చిందని భావిస్తున్నారు. ఏది ఏమైనా? సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమలో ఒక నటి ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోవడం సాధారణ విషయం కాదు. రామాయణంలో సీతమ్మ పాత్రకు ఆమె వంద శాతం న్యాయం చేయగలదనే నమ్మకంతోనే మేకర్స్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.