• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వరల్డ్ ఫేమస్ లవర్.....

వరల్డ్ ఫేమస్ లవర్.. నాలుగు కథల సీక్రెట్!

By - Tupaki Desk
Update: 2020-02-11 12:15 GMT
రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్' వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 న విడుదల కానుంది. సినిమాకు బజ్ ఎలా ఉన్నప్పటికీ యూత్ లో మాత్రం విజయ్ సినిమాకు ఆసక్తి ఎక్కువే. అయితే ఈ సినిమాలో విజయ్ నాలుగు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తున్నాడు.. నలుగురు హీరోయిన్ల తో రొమాన్స్ చేస్తున్నాడు. టీజర్.. ట్రైలర్ల లో ఈ లవ్ స్టోరీల శాంపిల్స్ చూపించారు. అయితే ఇదంతా ఏంటి అని చాలా మందికి అర్థం కాలేదు.

ఈ సినిమాలో విజయ్ ఒక రచయిత.. వరల్డ్ ఫేమస్ లవర్ ఎలా ఉంటాడు అనే భావనతో కథలు రాయడం మొదలు పెడతాడట. మొత్తం నాలుగు కథలు .. అన్నీ ఒకే సమయంలో జరుగుతాయి. ఆ కథలలో హీరో విజయ్.. హీరోయిన్లు మాత్రం మారతారు. మరి నిజంగా వరల్డ్ ఫేమస్ లవర్ ఎవరు? అనేది ఈ సినిమా లో చివరకు తెలుస్తుంది. ఏదేమైనా ఇలాటి స్టోరీతో సినిమాను తెరకెక్కించడం ఒక విభిన్నప్రయత్నమనే చెప్పాలి. ఎలాంటి పాత్రలో అయినా సహజంగా కనిపిస్తూ ఆ పాత్ర ఒదిగిపోవడం విజయ్ తీరు. అందుకే నాలుగు భిన్నమైన పాత్రలను ఎంతో ఈజ్ తో పోషించాడని అంటున్నారు.

అయితే ఈ స్టోరీలైన్ ఎంతవరకూ ప్రేక్షకులను మెప్పిస్తుంది? 'అర్జున్ రెడ్డి' తో మాటిమాటికీ వస్తున్న పోలికలను ఈ సినిమా ఎలా తప్పించుకుంటుంది అనేది వేచి చూడాలి. ఒకటి మాత్రం నిజం. సాధారణంగా వాలెంటైన్స్ డేకి ఒక సినిమాలో ఒక లవ్ స్టోరీని చూసే అవకాశం ఉంటుంది. ఈసారి మాత్రం రౌడీగారి పుణ్యమా అని ఒకే టికెట్టు కు నాలుగు ప్రేమ కథలు.. జాక్ పాట్ అనుకోవాలేమో!
Tags:    
  • World Famous Lover 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu Movie News 
  • Boggu Ganilo Lyrical Video 
  • Boggu Ganilo Song 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

భార్యపై పెరిగే ప్రేమకు ట్యూన్ కడితే.. నితిన్ 'పిచ్చి ప్రేమలో'!

2026-11-13 13:51 GMT

'ఫ్యామిలీ స్టార్' దెబ్బ.. విజయ్‌తో దిల్ రాజు ఈసారి మరోలా!

2026-11-13 13:49 GMT

ట్రైల‌ర్ టాక్: 'రామాయ‌ణం' లాంటి ఆఫ్రిక‌న్ పురాణేతిహాస క‌థతో!

2026-11-13 13:30 GMT

100 అడుగుల క్రేన్ ప్రమాదం నుంచి కాపాడిన అదృశ్య హస్తం!

2026-11-13 12:30 GMT

సృజనాత్మక స్వేచ్ఛకు సంకెళ్లు!

2026-11-13 11:36 GMT

రాజమౌళి ఆలోచన సరైనదేనా?

2026-11-13 11:30 GMT

సాయిపల్లవి పాదాలకు నమస్కరించిన కోచ్!

2026-11-13 10:28 GMT

'సెల్ఫ్ రెస్పెక్ట్ ' పద్ధతిలో కావ్య- అనిరుధ్ పెళ్లి.. ఈ పద్ధతి ఎప్పుడు? ఎక్కడ? ఎలా ఆవిర్భవించిందంటే?

2026-11-13 10:27 GMT

రామాయణంలో అతనికి మాత్రమే భారీ ప్రశంసలు!

2026-11-13 10:26 GMT

పిల్లల కోసం టికెట్ రేట్లు తగ్గించారు

2026-11-13 10:24 GMT

అక్క‌డాయ‌న అందుకే మెగాస్టార్ అయ్యారు!

2026-11-13 10:19 GMT

ట్రైల‌ర్ టాక్: 'తుంబాడ్' స్టైల్ మేకింగ్ ఆర్ట్‌వ‌ర్క్‌తో ద‌డ పుట్టిస్తోంది!

2026-11-13 10:18 GMT

Copyright @2026

Powered by Blink CMS