బ్రేక్ ఈవెన్ కి ఇంకా 21 కోట్లు రాబట్టాలి!
ఓవర్ నైట్ హైప్ క్రియేట్ చేయడం .. ఓవర్ పబ్లిసిటీతో లేనిపోని హంగామా క్రియేట్ చేయడం.. ఇవి అన్నివేళలా సరికాదని ప్రూవ్ అవుతూనే ఉంటుంది. రంగుల ప్రపంచం మాయావనం లాంటిది. అందినట్టే అంది అందలం దూరమవుతూ ఉంటుంది. సెంటిమెంటు పరిశ్రమలో అలా వెల్లువలా వచ్చి ఇలా చప్పున చల్లారిన హీరోలు ఉన్నారు. అయితే సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగించడం ద్వారా మాత్రమే సెంటిమెంటు ఇండస్ట్రీ కి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ విషయంలో తేడాలొస్తే మాత్రం మనుగడ సందిగ్ధంలో పడుతుంది. ప్రస్తుతం సెన్సేషనల్ రౌడీ స్టార్ దేవరకొండ సన్నివేశమేంటి? అంటే.. కాస్త డీప్ గానే విశ్లేషించాలి.
అర్జున్ రెడ్డి- గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్లతో రౌడీ విజయ్ దేవరకొండ స్థాయి అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే. మార్కెట్ పరంగా సేలబుల్ ఫిగర్స్ విషయంలో హైప్ ఒక్కసారిగా పెరిగింది. అయితే ఆ సక్సెస్ ని నిలబెట్టుకోవడంలోనే తడబాటు కనిపిస్తోంది. లేటెస్టుగా రిలీజైన వరల్డ్ ఫేమస్ లవర్ విషయంలో తాను ఒకటి తలిస్తే దైవమొకటి తలచిన చందంగా అయ్యింది. రౌడీ స్టార్ ఇమేజ్ దృష్ట్యా దాదాపు 30 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ సాగించారు. క్రియేటివ్ కమర్షియల్స్ వాళ్లు ఆ మేరకు హైప్ క్రియేట్ చేయగలిగారు. ట్రైలర్ చూశాక.. అర్జున్ రెడ్డి రేంజు హిట్టవుతుందే బయ్యర్లు నమ్మి కొనుక్కున్నారు కానీ... ఫలితం మాత్రం తారుమారైంది. ఈ సినిమా ఇప్పటికి 9 కోట్లు మాత్రమే వసూలు చేసిందని ట్రేడ్ చెబుతోంది. అంటే ఇంకో 21 కోట్లు బాక్సాఫీస్ వద్ద వసూలు చేయాల్సి ఉంటుంది.
ఈ రోజుల్లో మొదటివారం తర్వాత సినిమా థియేటర్లలో నిలబడటం కష్టం. అంటే ఇక లాంగ్ రన్ నుంచి వచ్చేదేమీ లేదన్న విశ్లేషణ సాగుతోంది. అయితే ఈ పరాజయం ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తోంది. విజయ్ దేవరకొండ స్టామినా అమాంతం 30 కోట్ల బిజినెస్ రేంజుకు పెరిగిపోయిందా? అంటే లేదింకా. అతడి రేంజు 10 కోట్లు మాత్రమే అని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ సన్నివేశం చూస్తుంటే రాను రాను విజయ్ ఒక ఫ్లూక్ హీరో అయిపోవడం ఖాయం అన్న టాక్ పరిశ్రమలో ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. ప్రతి హీరోకి బాక్సాఫీస్ స్టామినా పరంగా ఒక సరిహద్దు రేఖ అనేది రిజిడ్ గా ఉంటుంది. అది ఇదీ అని ప్రాక్టికల్ గానే ప్రూవ్ అయ్యింది.