చరణ్ మూవీకి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్?

ధురంధ‌ర్2 త‌ర్వాత మ్యూజిక్ డైరెక్ట‌ర్ శాశ్వ‌త్ స‌చ్‌దేవ్ పేరు దేశ‌మంత‌టా ఎక్కువ‌గా వినిపిస్తోంది.;

Update: 2026-03-30 12:21 GMT

ధురంధ‌ర్2 త‌ర్వాత మ్యూజిక్ డైరెక్ట‌ర్ శాశ్వ‌త్ స‌చ్‌దేవ్ పేరు దేశ‌మంత‌టా ఎక్కువ‌గా వినిపిస్తోంది. ఆల్రెడీ బాలీవుడ్‌లో తన‌దైన‌ స్టైల్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ కంపోజర్, ఇప్పుడు దురంధ‌ర్ ఫ్రాంచైజ్ సినిమాల‌ ద్వారా మ్యూజిక్ సెన్సేషన్ గా మారిపోయాడు. ముఖ్యంగా రీసెంట్ గా వ‌చ్చిన సీక్వెల్‌లోని సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, రీల్స్, షార్ట్ వీడియోల ద్వారా యూత్‌కు బలంగా కనెక్ట్ కావడం అతని రేంజ్‌ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది.

ఈ నేప‌థ్యంలోనే టాలీవుడ్‌లో కూడా అతనిపై ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ముఖ్యంగా రామ్ చ‌ర‌ణ్- సుకుమార్ కాంబినేషన్‌లో రాబోయే ప్రాజెక్ట్‌కు శాశ్వత్ సచ్ దేవ్ పేరును పరిశీలిస్తున్నారనే ప్రచారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణంగా నిఖిల్ ది ఇండియా హౌస్ ప్రాజెక్ట్ ను చెప్పుకోవ‌చ్చు. ఈ మూవీకి రామ్ చరణ్ నిర్మాణ భాగస్వామిగా ఉండటం, దానికి శాశ్వత్ మ్యూజిక్ అందించడం. ఈ కనెక్షన్ ఫ్యూచ‌ర్ లో మరిన్ని అవకాశాలకు దారితీస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే ఇక్క‌డ ఒక కీలక ప్రశ్న మాత్రం అంద‌రినీ వెంటాడుతుంది. శాశ్వత్ స్టైల్ మ‌న టాలీవుడ్ కమర్షియల్ టేస్ట్‌కు సూట్ అవుతుందా? అని. శాశ్వ‌త్ మ్యూజిక్‌లో పంజాబీ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంద‌నేది తెలిసిన విష‌య‌మే. కానీ తెలుగు ప్రేక్షకులు మాస్ బీట్, లోకల్ ఫ్లేవర్‌కు ఎక్కువగా కనెక్ట్ అవుతారు. ఈ నేపథ్యంలో అతని స్టైల్ ఇక్కడ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇదే డైరెక్టర్లకు ఒక రిస్క్ ఫ్యాక్టర్‌గా మారుతోంది.

అయినప్పటికీ, రిస్క్ తీసుకుంటే రివార్డ్ భారీగా ఉంటుందనే విషయం కూడా నిజమే. కొత్త మ్యూజిక్ డైరెక్టర్‌తో ప్రయోగం చేస్తే సినిమా సౌండ్ ట్రాక్ పూర్తిగా ఫ్రెష్‌గా అనిపించే అవకాశం ఉంటుంది. అదే హిట్ అయితే, అది సినిమాకే కాకుండా ఆ కంపోజర్ కెరీర్‌కూ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈ కోణంలో చూస్తే శాశ్వత్ సచ్ దేవ్ టాలీవుడ్‌కు నెక్ట్స్ బిగ్ థింగ్ గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న దేవీ శ్రీ ప్ర‌సాద్, అనిరుధ్ ర‌విచంద‌ర్ లాంటి స్టార్ కంపోజర్స్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగే సామర్థ్యం శాశ్వత్‌లో ఉంద‌నే అభిప్రాయం కూడా కొంద‌రిలో ఉంది. పాన్ ఇండియా స్థాయిలో సంగీతాన్ని అందించగలిగే అతని సామర్థ్యం, భిన్నమైన ఆలోచన.. అతన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. మొత్తానికి, శాశ్వత్ సచ్ దేవ్ ప్రస్తుతం ఓ కీలక దశలో ఉన్నాడు. టాలీవుడ్‌లో అడుగుపెడితే, అతని కెరీర్ కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. మ‌రి నార్త్ లో లాగానే సౌత్ ఆడియ‌న్స్ ను కూడా అత‌ను ఆక‌ట్టుకోగ‌ల‌డా లేదా అనేదానిపైనే ఇప్పుడు అంద‌రి దృష్టి ఉంది.

Tags:    

Similar News