చరణ్ రాకుంటే.. రంగంలోకి ఆ ఇద్దరు
రామ్ చరణ్ సినిమా డేట్ మారుతుందనే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.;
రామ్ చరణ్ సినిమా డేట్ మారుతుందనే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ‘పెద్ది’ రేసు నుంచి తప్పుకునే అవకాశం ఉందనే టాక్ రావడంతో, ఆ క్రేజీ స్లాట్‌ను దక్కించుకోవడానికి మిగతా సినిమాలు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా నిఖిల్ సిద్ధార్థ్, సమంత తమ సినిమాలతో ఆ తేదీపై కన్నేశారని టాక్ వస్తోంది. ఒక భారీ సినిమా తప్పుకుంటే ఆ గ్యాప్‌ను క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘స్వయంభూ’ ప్రస్తుతానికి ఏప్రిల్ 10న విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే చరణ్ సినిమా గనుక వాయిదా పడితే, ఏప్రిల్ 30కి మారాలని ఈ టీమ్ భావిస్తోంది. సమ్మర్ సెలవుల అడ్వాంటేజ్ ఉంటుందని, సోలో రిలీజ్ దొరికితే బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు రాబట్టడం ఈజీ అవుతుందని నిఖిల్ టీమ్ అంచనా వేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి హైప్ ఉండటంతో సరైన డేట్ కోసం వెతుకుతున్నారు.
మరోవైపు సమంత నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా కూడా ఇదే లైన్లో ఉంది. ఈ చిత్రాన్ని మే 15న రిలీజ్ చేయాలని మేకర్స్ ముందుగా అనుకున్నారు. కానీ ఏప్రిల్ నెలాఖరున వచ్చే వీకెండ్ బాగుంటుందని, చరణ్ సినిమా రాకపోతే తామే ఆ డేట్‌కు వస్తామని సమంత టీమ్ ఆసక్తి చూపిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమా కావడంతో సమ్మర్ సీజన్ ఈ సినిమాకు బాగా ప్లస్ అవుతుందని ప్లాన్ చేస్తున్నారు.
నిజానికి ఏప్రిల్ 30 అనేది సినిమాలకు చాలా కీలకమైన సమయం. అటు ఎండలు ఎక్కువగా ఉండటం, ఇటు సెలవులు ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపిస్తారు. అందుకే ఒక ప్రూవ్డ్ హీరో అయిన నిఖిల్, పాపులర్ స్టార్ సమంత తమ చిత్రాలను ఆ స్లాట్ లో దింపాలని చూస్తున్నారు. ‘పెద్ది’ సినిమా యూనిట్ నుంచి అధికారికంగా వాయిదా ప్రకటన రాకముందే ఈ రేసు మొదలవ్వడం విశేషం.
చరణ్ సినిమా వాయిదా పడుతుందనే రూమర్లు రావడానికి కారణం షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉండటమే. ఒక సాంగ్ తో పాటు కొన్ని కీలక సీన్లు షూట్ చేయాల్సి ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ కు సమయం సరిపోదని బుచ్చిబాబు టీమ్ భావిస్తోంది. టీజర్ లో డేట్ ఇచ్చినా సరే, క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని మేకర్స్ అనుకుంటున్నారు. ఒకవేళ వాయిదా కన్ఫర్మ్ అయితే మాత్రం నిఖిల్ లేదా సమంతలో ఎవరో ఒకరు ఆ తేదీని లాక్ చేసుకునే ఛాన్స్ ఉంది.
ప్రస్తుతానికి గాసిప్స్ అయితే వైరల్ అవుతూనే ఉన్నాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో ‘పెద్ది’ విడుదలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చరణ్ పక్కకు తప్పుకుంటే నిఖిల్ వస్తారా లేక సమంత రేసులోకి దూకుతారా అనేది చూడాలి. సమ్మర్ బాక్సాఫీస్ దగ్గర ఈ డేట్ వార్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇద్దరూ ఒకేసారి ఆ డేట్ కోసం ప్రయత్నిస్తే పోటీ ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.