వైఫల్యమే ఉత్తమ గురువుగా నిర్దేశించుకున్న నటి!
బాలీవుడ్ కథానాయిక కృతి సనన్ ఈ విషయంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.;
సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రతి నటికీ సక్సెస్ అనేది ఓ కల. వైఫల్యాలను స్వీకరించి వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడం అనేది అంతకు మించిన మరో గొప్ప కళ. బాలీవుడ్ కథానాయిక కృతి సనన్ ఈ విషయంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. తనకు ఎదురైన ప్రతి పరాజయాన్ని ఒక అపజయంగా కాకుండా తనను తాను మెరుగుప రుచుకునే ఒక ఉత్తమ గురువుగా భావిస్తూ ముందుకు సాగుతోంది. వృత్తిపరమైన ప్రయాణంలో కృతి సనన్ ఎప్పుడూ ఒకే పద్ధతికి పరిమితం కాలేదు. గ్లామర్ పాత్రల నుంచి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల వరకు ఆమె ఎంచుకున్న ప్రతి సినిమా ఒక ప్రయోగమే.
అయితే కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయినప్పుడు ఆమె నిరాశకు గురికాకుండా ఆ వైఫల్యాల వెనుక ఉన్న కారణాలను విశ్లేషించుకుంటుందిట. ఒక నటిగా తనలో ఇంకా ఎలాంటి మార్పులు అవసరమో? తెలుసుకోవడానికి ఈ అనుభవాలే ఆమెకు దిశానిర్దేశం చేస్తాయంది. ప్రస్తుత తరం నటీమణులలో కృతి సనన్ ఎంతో పరిణతితో వ్యవహరిస్తుంది. ఒక సినిమా ప్లాప్ అయితే దాన్ని తన బాధ్యతగా స్వీకరిస్తానంది. తదుపరి ప్రాజెక్టులో తప్పులు జరగకుండా జాగ్రత్త తీసుకుంటానంటోంది. వైఫల్యం కలిగించే బాధను భరిస్తూనే దాని నుంచి వచ్చే పాఠాన్ని తన నటనలో ప్రతిబింబింపజేయడం అమ్మడి ప్రత్యేకతగా చెప్పుకొచ్చింది.
అందుకే `మిమీ` వంటి చిత్రంలో అమ్మడిలో అసలైన నటిని ప్రేక్షకులకు పరిచయం చేసానంది. నటనలోనే కాకుండా కథల ఎంపికలో కూడా కృతి సనన్ వైఫల్యాల నుంచి నేర్చుకున్న పాఠాలు కెరీర్ ఎదుగుదలకు ఎంతో దోహదం చేసాయింది . పరాజయాలు ఎదురైనప్పుడు కెరీర్ పట్ల మరింత కఠినంగా నిర్ణయాత్మకంగా వ్యవహరిం చడం కృతి సనన్ శైలిగా చెప్పుకొచ్చింది. తనను తాను నమ్ముకుని ప్రతి వైఫల్యాన్ని ఒక మెట్టుగా మలుచు కుంటానంది. అంతటి ప్రతిభావంతు రాలు కావడంతోనే జాతీయ ఉత్తమ నటిగా అవార్డు సైతం అందుకోగల్గింది.
ఈ విషయంలో కృతి సనన్ ఎంతో మంది సీనియర్లను సైతం వెనక్కి నెట్టి రేసులో నిలిచింది. అమ్మడికి జాతీయ అవార్డు ఎంతో నిజాయితీగా వచ్చింది. ఆ రకంగా కృతి సనన్ నేటి తరం నటీమణులకు ఒక ప్రేరణగా నిలుస్తుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగని అక్కడికే పరిమితం కాలేదు. ఇతర భాషల్లోనూ మంచి అవకాశాలు వస్తే సద్వినియోగం చేసుకుంటుంది. మహేష్ హీరోగా నటించిన `వన్` సినిమాతో టాలీవుడ్ లోనూ లాంచ్ అయింది. అటుపై మరో రెండు ..మూడు తెలుగు సినిమాలు చేసింది. కానీ ఇక్కడ అనుకున్నంత గా సక్సెస్ అవ్వలేదు. దీంతో తిరిగి బాలీవుడ్ కి వెళ్లి అక్కడే నిలదొక్కుకుంది.