వేకువ‌ఝామున వ‌రుణ్ తేజ్ చేసిన ప‌ని..!

Update: 2021-05-24 10:30 GMT
మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న `గ‌ని` చిత్రీక‌ర‌ణ‌కు బ్రేక్ ప‌డిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా మ‌హ‌మ్మారీ సెకండ్ వేవ్ ప్ర‌భావంతో చిత్రీక‌ర‌ణ‌ నిల‌చిపోయింది. ఈ ఖాళీ స‌మ‌యాన్ని అతడు సోష‌ల్ మీడియాల్లో ఫాలోవ‌ర్స్ ని పెంచుకునే ప‌నిలో ఉన్నారు. ఇటీవ‌ల వ‌రుణ్ ఇన్ స్టా వేదిక‌గా ఎంతో యాక్టివ్ గా రెగ్యుల‌ర్ గా ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తుంటే అవి వైర‌ల్ గా మారుతున్నాయి. తాజాగా అత‌డు వేకువ ఝామున కిటికీ నుంచి చూస్తున్న ఫోటోని షేర్ చేశారు. సూర్య కాంతి అప్పుడే ఇంట్లో ప్ర‌వేశిస్తోంది. ఈ కాన్సెప్ట్ బేస్డ్ ఫోటోలో వ‌రుణ్ ట్రాక్ సూట్ లో క్యాజువ‌ల్ లుక్ లో ఎంతో స్మార్ట్ గా క‌నిపిస్తున్నాడు.

వ‌రుణ్ న‌టిస్తున్న ప‌దో సినిమా పూర్తి  కాగానే అత‌డు మైత్రి మూవీ మేక‌ర్స్ లో న‌టించాల్సి ఉంటుంది. వరుణ్ తేజ్ కోసం మంచి దర్శకుడిని వెతికే ప‌నిలో ఉంది మైత్రి. తాజా నివేదికల ప్రకారం..  వరుణ్ తేజ్ కు భారీ అడ్వాన్స్ మొత్తాన్ని చెల్లించిన మైత్రి సంస్థ‌ సరైన దర్శకుడిని కనుగొనడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోందిట‌. వరుణ్ తేజ్ అన్నిటా ఛూజీగా ఉండ‌డ‌మే ఇందుకు కార‌ణం.

ఇప్ప‌టివ‌ర‌కూ క‌లిసిన ఓ ఇద్ద‌రు దర్శకులు విన్నింగ్ స్క్రిప్ట్ తో ముందుకు రాలేదు. ఎవ‌రైనా దర్శకుడు తన స్క్రిప్ట్ తో వరుణ్ తేజ్‌ను ఆకట్టుకోవడంలో విజయం సాధిస్తే మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది.

మరోవైపు వరుణ్ తేజ్ ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా గ‌నితో బిజీగా ఉన్నాడు. ఇందులో అతను బాక్సర్ పాత్రను పోషిస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి ఈ ప్రాజెక్టుకు ద‌ర్శ‌కుడు. ఉపేంద్ర- సునీల్ శెట్టి- జగపతి బాబు- నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో స‌యీ మంజ్రేకర్ కథానాయిక‌. వరుణ్ తేజ్ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఇంకా ప్రకటించాల్సి ఉంది.
Tags:    

Similar News