స్టార్ హీరో ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం

Update: 2021-10-06 04:30 GMT
కోలీవుడ్ స్టార్ హీరో చిక్కుల్లో పడ్డాడు. ఓ మహిళ ఆయన ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. కోలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న అజిత్ సినిమాలు వందల కోట్లలో వసూళ్లు సాధిస్తుంటాయి. తెలుగు నాట కూడా అజిత్ కు ఫుల్ క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న ‘వాలిమై’ షూటింగ్ ను ఇటీవల హైదరాబాద్ లోనే తీశారు. అజిత్ వివాదాల జోలికి వెళ్లకుండా తన ఫ్యామిలీతో ఎక్కువగా గడుపుతుంటారు.

అలాంటి హీరో కారణంగా తను ఇబ్బంది పడ్డానని ఓ మహిళ ఏకంగా అజిత్ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అజిత్ ను కలవడానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా కుదరలేదని.. తన చావుకు కారణం అజిత్ అంటూ కేకలు వేసి ఒంటిపై పెట్రోల్ పోసుకుంది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సదురు మహిళ ఒంటిపై నీళ్లు పోసి అదుపులోకి తీసుకున్నారు.

ఫర్జానా అనే మహిళ ఓ ప్రైవేటు హాస్పిటల్ లో నర్సుగా పనిచేస్తున్నారు. గత ఏడాది కరోనా సమయంలో అజిత్, షాలిని అదే ఆస్పత్రికి వెళ్లారు. దీంతో ఫర్జానా అజిత్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అప్పట్లో వీడియో వైరల్ అయ్యింది. అజిత్ కరోనా బారిన పడ్డాడంటూ వార్తలు గుప్పుమన్నాయి.

హాస్పిటల్ లో నిబంధనలకు విరుద్ధంగా ఫర్జానా ప్రవర్తించిందని.. ఆమెను ఉద్యోగంలోంచి తీసేశారు. అయితే అజిత్ ను కలిసి తనకు ఉద్యోగం ఇప్పించాలని వేడుకోవడానికి చాలా సార్లు ఆయన ఇంటికెళ్లినా కలవలేదు. ఈ నేపథ్యంలోనే తనకు న్యాయం చేయాలంటూ తాజాగా ఆయన ఇంటి ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకొని కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని సమాచారం.
Tags:    

Similar News