బిగ్‌ బాస్‌ 4లో సుజీత్‌ హీరోయిన్‌?

Update: 2020-09-04 00:30 GMT
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 మరో మూడు రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్‌ ఫైనల్‌ అయ్యారు. వారు రెండు వారాల క్రితమే ఐసోలేషన్‌ కు వెళ్లి పోయారు. బిగ్‌ బాస్‌ ప్రారంభం కాబోతున్న నేపథ్యం కంటెస్టెంట్స్‌ విషయంలో క్లారిటీ వస్తోంది. ఇప్పటికే కొందరు కంటెస్టెంట్స్‌ విషయంలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో యూట్యూబ్‌ స్టార్‌ కొన్ని సినిమాల్లో నటించి మెప్పించిన స్వాతి దీక్షిత్‌ ఈసారి బిగ్‌ బాస్‌ హౌస్‌ లోకి ఎంటర్‌ అవ్వబోతుంది. ఈ అమ్మడు ఇప్పుడు స్టార్‌ మా వారు ఇచ్చిన ఒక హోటల్‌ లో క్వారెంటైన్‌ లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

సుజీత్‌ రన్‌ రాజా రన్‌ సినిమా చేయక ముందు పలు యూట్యూబ్‌ షార్ట్‌ ఫిల్మ్‌ లు తీశాడు. తన సొంత బడ్జెట్‌ తో సుజీత్‌ పలు షార్ట్‌ ఫిల్మ్‌ లు తీసి యూట్యూబ్‌ లో షేర్‌ చేసిన విషయం తెల్సిందే. సుజీత్‌ తన షార్ట్‌ ఫిల్మ్‌ ల్లో ఎక్కువగా స్వాతి దీక్షిత్‌ ను నటింపజేశాడు. ఆమెతో సుజీత్‌ కు మంచి స్నేహం కూడా ఉన్నట్లుగా సమాచారం.

ఆ స్నేహంతోనే కొన్ని సినిమాల్లో ఆఫర్లు కూడా దక్కించుకుందట. ఇప్పుడు సొంతంగానే ఈమె బిగ్‌ బాస్‌ జర్నీ ప్రారంభం చేయబోతుంది. నటిగా మంచి గుర్తింపు కోసం పరితపిస్తున్న ఈ అమ్మడు బిగ్‌ బాస్‌ తో వచ్చిన గుర్తింపుతో హీరోయిన్‌ గా టర్న్‌ అవ్వచ్చు అని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈనెల 6న ప్రారంభం కాబోతున్న బిగ్‌ బాస్‌ షో తో ఈమె షో లో ఉందా లేదా అనే విషయంపై క్లారిటీ రానుంది.
Tags:    

Similar News