పిక్‌టాక్ : దేవరకొండ - మందన్న ఫుల్ ఫ్యామిలీ
పెళ్లికి సంబంధించిన ఫోటోలు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క చిన్న మూమెంట్ సైతం నెట్టింట అత్యధిక వ్యూస్, షేర్స్‌ను సొంతం చేసుకుంది.;
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమ జర్నీ పెళ్లి పీటల వరకు సాగింది. సుదీర్ఘ కాలంగా ప్రచారం జరుగుతూ వచ్చిన ప్రేమ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టిన ఈ స్టార్ జోడీ ఒక్కటి అయ్యారు. వారం రోజుల పాటు పెళ్లి హడావిడి కనిపించింది. సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు ఓ రేంజ్‌లో వైరల్ అయిన విషయం తెల్సిందే. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి హడావిడి నుంచి తిరిగి వర్క్‌లో మునిగి పోయారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ కొత్త సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడని సమాచారం అందుతోంది. మరో వైపు రష్మిక మందన్న సైతం వరుస సినిమాలు చేసేందుకు రెడీ అవుతోంది. దాదాపు రెండు నెలల బ్రేక్ తీసుకున్న రష్మిక అతి త్వరలోనే షూటింగ్‌లో జాయిన్ అయ్యి, బిజీ బిజీగా షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు ఆమె సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి...
సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఫోటోలు ఏ స్థాయిలో వైరల్ అయ్యాయో తెలిసిందే. పెళ్లికి సంబంధించిన ఫోటోలు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క చిన్న మూమెంట్ సైతం నెట్టింట అత్యధిక వ్యూస్, షేర్స్‌ను సొంతం చేసుకుంది. పెళ్లి సందర్భంగా రష్మిక మందన్న తల్లిదండ్రులు సోషల్ మీడియాలో సందడి చేశారు. వారి ఫోటోలు ఇప్పటి వరకు పెద్దగా సోషల్ మీడియాలో కనిపించలేదు. కానీ పెళ్లిలో వారు విజయ్ దేవరకొండ తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఫోటోలతో వైరల్ అయ్యారు. విజయ్ దేవరకొండ అత్తమామ అంటూ వీరి ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేశారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న తల్లిదండ్రులు వీళ్లే అంటూ వీరిద్దరి ఫోటోలు ఎక్కువ వైరల్ కావడం తెలిసిందే. తాజాగా మరోసారి రష్మిక మందన్న తల్లిదండ్రులు ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దేవరకొండ - మందన్న ఫ్యామిలీ...
విజయ్ దేవరకొండ అభిమానులు తెగ షేర్ చేస్తున్న ఈ ఫోటోలో దేవరకొండ - మందన్న ఫ్యామిలీ మొంబర్స్ ఉన్నారు. విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు, రష్మిక మందన్న తల్లిదండ్రులు ఈ ఫోటోలో కనిపించడంతో నిండుతనంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగానే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫోటోలు అంటే సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం చూస్తూ ఉంటాం. అలాంటిది ఇలా రెండు ఫ్యామిలీస్ కలిసి ఉన్న ఫుల్ ఫోటోను ఏ స్థాయిలో అభిమానులు షేర్ చేస్తారో చెప్పనక్కర్లేదు. తెలుగు ఫ్యామిలీ, కన్నడ ఫ్యామిలీ కలయిక కన్నుల పండుగగా ఉంది అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు. తల్లిదండ్రులు నిల్చుని ఉండగా, సింపుల్ ఔట్ ఫిట్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వారి కాళ్ల వద్ద కూర్చుని ఉండటం చాలా నేచురల్‌గా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రణబాలి సినిమాతో...
పెళ్లి అయ్యి వారాలు గడుస్తున్నా ఇప్పటికీ వీరి ఫోటోలు తెగ వైరల్ కావడం మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఒక సెలబ్రిటీ కపుల్ పెళ్లి ఫోటోలు, వీడియోలు, పోస్ట్ వెడ్డింగ్ ఫోటోలు ఈ స్థాయిలో వైరల్ కావడం ఇదే అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి 'రణబాలి' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న దర్శకుడు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. విజయ్, రష్మికల వివాహం సందర్భంగా రణబాలి సినిమా నుంచి వచ్చిన పాట సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే ఏడాదిలో రణబాలి సినిమా విడుదల కాబోతుంది.