SSMB28 లో మరో హీరోనా?.. ఏం జరుగుతోంది?
సూపర్ స్టార్ మహేష్ బాబు `సర్కారు వారి పాట` రిలీజ్ తరువాత ఫుల్ జోష్ తో కనిపిస్తున్నారు. తను, తన అభిమానులు కోరుకున్న విజయం ఈ సినిమాతో దక్కిందంటూ సెలబ్రేషన్ మోడ్ లోకి వెళ్లిపోయారు. దాదాపు రెండేళ్ల విరామం తరువాత లభించిన విజయంగా అభివర్ణిస్తూ తదుపరి సినిమారు రెడీ అయిపోతున్నారు. పరశురామ్ పెట్ల డైరెక్ట్ చేసిన `సర్కారు వారి పాట` ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిశ్రమ ఫలితాన్ని సొంతం చేసుకుంది.
అయితే వసూళ్ల పరంగా మాత్రం ఈ మూవీ పలు రికార్డుల్ని సొంతం చేసుకుంటోందంటూ మేకర్స్, ట్రేడ్ వర్గాలు మాత్రం చెబుతున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఇప్పటికే రూ. 100 కోట్ల షేర్ ని ప్రపంచ వ్యాప్తంగా సాధించిందని తెలుస్తోంది. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేయబోతున్న సినిమాకు రెడీ అవుతున్నాడు మహేష్. SSMB28 గా తెరపైకి రానున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబతోంది. ఇందు కోసం త్రివిక్రమ్ ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన ఓ అప్ డేట్ ప్రస్తుతం హాట్ గా మారింది. గత కొన్ని రోజులుగా ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ఇంకా రావడం లేదంటూ ఎదురుచూస్తున్న మహేష్ అభిమానులకు త్రివిక్రమ్ సర్ ప్రైజ్ అప్ డేట్ ని ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మూవీలో హీరో మహేష్ తో పాటు మరో హీరోకు కూడా స్పేస్ వుందని, అయితే అది గెస్ట్ పాత్రకు మించి వుంటుందని సమాచారం. ఈ పాత్ర కోసం ఇప్పటికే త్రివిక్రమ్ ఇద్దరు ముగ్గురు హీరోలని సంప్రదిస్తున్నారట.
ఇటీవల అల్లు అర్జున్ తో చేసిన ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ `అల వైకుంఠపురములో` చిత్రంలో అక్కినేని వారి హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. మహేష్ మూవీలోనూ అలాంటి పాత్రనే ఒకటి వుందంట ఆ పాత్ర కోసం ముగ్గురు క్రేజీ హీరోలని అనుకుంటున్న త్రివిక్రమ్ ముందు నేచురల్ స్టార్ నానిని సంప్రదించారని ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య నాగార్జున తో కలిసి నాని `దేవదాస్` మూవీలో నటించిన విషయం తెలిసిందే.
అలాంటి ప్రాముఖ్యత వున్న పాత్ర అయితే చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఓ సందర్భంలో నాని చెప్పడంతో తనయితే మహేష్ తో బాగుంటుందని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట. ఫ్యాన్స్ మాత్రం ఈ ప్రాజెక్ట్ గురించి పక్కన పెట్టేసి రాజమౌళి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. మరి ఫ్యాన్స్ కి త్రివిక్రమ్ నిజంగానే నానితో సర్ ప్రైజ్ ఇస్తాడా? లేక మరో హీరోని ఫైనల్ చేస్తాడా? అన్నది తెలియాలంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.