టాలీవుడ్ లో ఈ సినిమాలు కొత్త టైటిల్ ట్రెండ్ సెట్ చేస్తాయా!
ఏదైనా ఒక సినిమా హిట్ అయితే ఆ తరహా సినిమాలు అనేకం రావడం ఏ భాష సినీ ఇండస్ట్రీలో అయినా రొటీన్ గా జరిగేదే. అలా కొన్ని సినిమాలు ట్రెండ్ సెట్ చేస్తాయి. అదే ట్రెండ్ లో అనేక సినిమాలు వస్తాయి. కొంతకాలానికి ఆ ట్రెండ్ లో సినిమాలు జనాలను విసిగిస్తాయి. మళ్లీ కొత్త ట్రెండ్ వస్తుంది.
సినిమాల కథాంశాల విషయంలోనే కాదు.. సినిమాల టైటిళ్ల విషయం లో కూడా అలాంటి అనుకరణలు ఉంటాయి. ఆ మధ్య మారుతి మార్కు యూత్ బూతు సినిమాలు హిట్ అయినప్పుడు ఒకే తరహా టైటిళ్లు వినిపించాయి. ఈరోజుల్లో, బస్టాప్ తో మొదలుపెడితే.. 3జీ లవ్, సెకెండ్ హ్యాండ్.. వంటి టైటిళ్లు వచ్చాయి. వాటన్నింటిలోనూ యూత్ పేరుతో బూతులను అమ్ముకునే ప్రయత్నం జరిగింది.
ఇక అత్తారింటికి దారేదీ సినిమాతో లెంగ్తీ తెలుగు టైటిళ్ల కు డిమాండ్ పెరిగింది. శ్రీనివాస కళ్యాణం, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, బ్రోచేవారెవరురా వంటి వాటితో పాటు ఇటీవలి అల వైకుంఠపురంలో.. ఇలా అలాంటి లెంగ్తీ తెలుగు టైటిళ్లు అడపాదడపా వస్తూనే ఉన్నాయి.
ఇక మరో రెండు సినిమాలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తూ ఉన్నాయి. వరల్డ్ ఫేమస్ లవర్, ఈ సినిమా అతి త్వరలోనే విడుదల కాబోతోంది. మరోవైపు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అంటూ అఖిల్ సినిమా వస్తోంది. ఈ రెండు సినిమాలూ లెంగ్తీ ఇంగ్లిష్ టైటిల్ ను కలిగి ఉన్నాయి. వీటి సౌండింగ్ కూడా ఒకేలా, హీరోని ఎలివేట్ చేసేలా ఉంది. మరి ఈ సినిమాలు గనుక హిట్ అయితే.. తెలుగు సినిమాలు లెంగ్తీ ఇంగ్లిష్ టైటిళ్లను అందుకునే అవకాశం ఉంది. అయితే ఇవి హిట్ కావడం మీదే వీటి టైటిల్ ట్రెండ్ ఆధారపడి ఉంటుంది.