స్టార్ హీరో - అగ్ర‌ నిర్మాత మ‌ధ్య విభేధాల‌కు షాకింగ్ కార‌ణం

కానీ ఇప్పుడు ఒక ఇండ‌స్ట్రీ రికార్డ్ బ్రేకింగ్ హిట్టు కొట్టాక ఆ నిర్మాత తిరిగి త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి ప్రాజెక్ట్ చేద్దామ‌ని అన్నాడు..;

Update: 2026-02-11 04:07 GMT

మొద‌ట ఆ నిర్మాత కం న‌టుడు త‌న సినిమాకు హీరోగా ఒక‌రిని ఎంపిక చేసుకున్నాడు...కానీ ఇంత‌లోనే మ‌న‌సు మార్చుకున్నాడు.. స‌క్సెస్ లేదని ఎంపిక చేసుకున్న‌ ఆ హీరోని చిన్న చూపు చూసాడు..ప‌ర్య‌వ‌సానంగా వేరొక హీరో కోసం ప్ర‌య‌త్నించాడు.. అత‌డితో మంత‌నాలు సాగించాడు...అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ఆ హీరో నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాలేదు..కానీ ఇంత‌లోనే ఈ విష‌యం మొద‌ట ఎంపిక చేసుకున్న స్టార్ హీరోకి తెలిసింది...

దీంతో అత‌డిలో ఈ ప్రాజెక్టుపై ఆస‌క్తి త‌గ్గింది.

స‌క్సెస్ లేని హీరోతో ఇంత భారీ ప్రాజెక్టును ముందుకు తీసుకెళితే బిజినెస్ ప‌రంగా ఇబ్బందులు త‌లెత్తుతాయ‌ని నిర్మాత భావించాడు.. సేఫ్ గేమ్ ఆలోచించాడు. దీనివ‌ల్ల ఇద్ద‌రి మ‌ధ్యా క‌మ్యూనికేష‌న్ గ్యాప్ వ‌చ్చింది.. విభేధాలు పెరిగాయి. చివ‌రికి ఆ స్టార్ హీరో అస‌లు స్క్రిప్టు త‌న‌కు న‌చ్చ‌లేద‌ని మెలిక వేసాడు. స్క్రిప్టు న‌చ్చ‌కుండా ఏదైనా సినిమాకి సంత‌కం చేయ‌డం కుద‌ర‌ద‌ని మొరాయించాడు.. క‌ట్ చేస్తే దీనికి కార‌ణం కూడా అత‌డు చెప్పాడు... మొద‌ట త‌న‌ను సంప్ర‌దించిన స‌ద‌రు నిర్మాత కం హీరో ఆ త‌ర్వాత వేరొక హీరోతో సంప్ర‌దింపులు జ‌రిపాడు.. మ‌ధ్య‌లో త‌న‌ను వ‌దిలేసాడు..

కానీ ఇప్పుడు ఒక ఇండ‌స్ట్రీ రికార్డ్ బ్రేకింగ్ హిట్టు కొట్టాక ఆ నిర్మాత తిరిగి త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి ప్రాజెక్ట్ చేద్దామ‌ని అన్నాడు.. దీంతో విసిగిపోయి.. అత‌డి డ‌బుల్ స్టాండార్డ్ న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల్ల తాను ఈ ప్రాజెక్టులో చేయ‌న‌ని చెప్పాడు. చివ‌రికి ఈ స‌మ‌స్య ఈగో స‌మ‌స్య‌గా మారింది. ఇద్దరి మ‌ధ్యా ఇప్పుడు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డానికి నిర్మాత‌ల గిల్డ్ కూడా క‌లుగ జేసుకోవాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. నిర్మాత ప్రీప్రొడ‌క్ష‌న్ కోస‌మే కోట్ల‌లో ఖ‌ర్చు చేసాన‌ని, హీరో స‌డెన్ గా హ్యాండివ్వ‌డం వ‌ల్ల‌ తీవ్ర న‌ష్టాలొచ్చాయని, అత‌డు 40 కోట్లు చెల్లించాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్నాడు. అయితే త‌న‌కు న‌చ్చ‌ని స్క్రిప్టును తిర‌స్క‌రించే హ‌క్కు త‌న‌కు ఉంటుంద‌ని, ఇందులో ఇత‌రులకు ఏమిటి స‌మ‌స్య అని స్టార్ హీరో వాదిస్తున్నాడు. ఆ ఇద్ద‌రి వాద‌న‌లు విని స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు నిర్మాత‌ల గిల్డ్ సీరియ‌స్ గా ప్ర‌య‌త్నిస్తోంది. ఒక‌వేళ ఈ స‌మ‌స్యకు మ‌ధ్య‌వ‌ర్తుల మ‌ధ్య ప‌రిష్కారం ల‌భించ‌ని ప‌క్షంలో కోర్టుకు వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయ‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అయితే ఇండ‌స్ట్రీ పెద్ద‌లు దీనిని ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలిసింది.

ఒక అగ్ర హీరోని ఎంపిక చేసుకుని ఆ త‌ర్వాత ప్రీప్రొడ‌క్ష‌న్ కోసం నిర్మాత‌లు భారీ మొత్తాల‌ను ఖ‌ర్చు చేయ‌డం చూస్తున్న‌దే. అయితే స్టార్ హీరోతో ఒప్పంద ప‌త్రం రాయించుకోనంత‌వ‌ర‌కూ నిర్మాత ఏం చేయ‌గ‌ల‌రు? ఒప్పందం మీరితే క‌చ్ఛితంగా కోర్టుల్లో అయినా పెద్ద మ‌నుషుల పంచాయితీలో అయినా తీర్పు నిర్మాత వైపు సానుకూలంగా ఉంటుంద‌ని ప్రాథ‌మికంగా విశ్లేషిస్తున్నారు. ఇంత‌కీ స్టార్ హీరోతో అగ్రిమెంట్ అయిందా లేదా? అన్న‌దానిపైనా పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.

Tags:    

Similar News