గురూజీని ఇరకాటంలో పెట్టేసిన శిష్యుడు!
కానీ తన ప్లాన్ ఇది? ఆ కలయికలో సినిమా ప్లానింగ్ ఉందని పెదవి దాటనివ్వలేదు. ఆ విషయంలో సుకుమార్ శిష్యుడిని ఎంత మాత్రం నిరుత్సాహ పరచలేదు.;
సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు. గురువు మాటని జవదాటని గొప్ప శిష్యుడు. గురువు ఎంత చెబితే అంత. శిష్యుడు ఏం చేయాలనుకున్నా ముందు తన ఆలోచన ఇదీ అని గురువుకు తప్పక తెలియజేస్తాడు. గురువు అనుమతిస్తేనే ముందుకెళ్తాడు. లేదంటే ఆ ఆలోచన అక్కడే ఆపేస్తాడు. అలాంటి గురువు విజన్ లోకి శిష్యుడు ముందే దురాడా? లేక ఎలా ఉప్పందిందో ? తెలియదు గానీ గురువును మించిన శిష్యుడని బుచ్చిబాబు మరోసారి ప్రూవ్ చేసాడు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా పెద్ది చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకుంది. అతి త్వరలోనే సినమా పాన్ ఇండియాలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.చరణ్ సరసన జాన్వీకపూర్ ని హీరోయిన్ గా తీసుకోవాలని దేవర సినిమా సెట్స్ లో ఉన్న సమయంలోనే బుచ్చిబాబు సంకల్పించాడు. అలా పట్టుబట్టి మరీ పెద్ది సినిమాకు ఎంపిక చేసాడు. ఇక్కడే గురువు ఆలోచనలోకి శిష్యుడు దూరాడని తెలుస్తోంది. రామ్ చరణ్ 17 వ చిత్రం సుకుమార్ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. అయితే ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను, సంగీత దర్శకుడిగా రెహమాన్ ను తీసుకోవాలన్నది సుకుమార్ ప్లాన్ గా లీకైంది. ఇలాంటి కాంబినేషన్ లో సినిమా చేయాలని సుకుమార్ ఇప్పటికిప్పుడు అనుకోలేదు. బుచ్చిబాబు `పెద్ది`ని మొదలు పెట్టక ముందే భావించాడు. కానీ
గురువు ఐడియానే తస్కరించి బుచ్చిబాబు పెద్ది సినిమాకు జాన్వీ ని హీరోయిన్ గా, రెహమాన్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసేసాడు. ఈ విషయాలన్నీ సుకుమార్ కే చెప్పే చేసాడు బుచ్చిబాబు.
కానీ తన ప్లాన్ ఇది? ఆ కలయికలో సినిమా ప్లానింగ్ ఉందని పెదవి దాటనివ్వలేదు. ఆ విషయంలో సుకుమార్ శిష్యుడిని ఎంత మాత్రం నిరుత్సాహ పరచలేదు. తాను చేయకపోయినా శిష్యుడు చేస్తున్నాడనే సంతోషాన్ని మనసులో నింపుకున్నాడు. హీరోయిన్ సంగతి పక్కన బెడితే? ఒకవేళ సుకుమార్ గనుక రెహమాన్ ని తెరపైకి తెస్తే అది వేరే లెవల్లో ఉండేది. ఎందుకంటే సుకుమార్ ఇప్పటి వరకూ తెరకెక్కించిన సినిమాలన్నింటికి సంగీతం అందించింది ఒకే ఒక్కడు.
అతడే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్. సుకుమార్ దేవిని నమ్మినంతగా మరే సంగీత దర్శకుడిని నమ్మరు. అందుకే ఆ కాంబినేషన్ అన్ని సార్లు సాధ్యమైంది. మరి ఇప్పుడు సుకుమార్ ఏం చేసే అవకాశం ఉంది? అంటే వెంటనే మళ్లీ రెహమాన్ తీసుకున్నా? కిక్ ఉండదు. ప్రెష్ నెస్ పోతుంది. హీరోయిన్ విషయంలోనూ అదే పరిస్థితి. కాబట్టి సుకుమార్ ఈసారికి వారిద్దరి స్థానంలో కొత్త వారితే ముందుకెళ్తేనే ఉత్తమంగా ఉంటుంది.