క్రియేటివ్ డైరెక్టర్ పుకార్లకు చెక్ పెట్టనున్నాడా..??

Update: 2021-05-01 06:41 GMT
ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీలో అనుకోని మార్పులు చోటుచేసుకుంటాయి. అనుకున్నవన్నీ తారుమారు అవుతూ అనుకోనివి జరిగి పోతుంటాయి. ప్రస్తుతం అలాంటి పరిస్థితి టాలీవుడ్ ఇండస్ట్రీలో కనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి సినిమా ప్రమోషన్స్ చేసాక సరిగ్గా విడుదల సమయంలో వాయిదా అనే పదం వినిపించే సరికి చాలా నిరుత్సాహపడాల్సి వస్తుంది. కొన్ని సినిమాల విషయంలో ఇదే జరిగింది. మరికొన్ని సినిమాలు ఎంతవరకు పూర్తయ్యాయో తెలియదు. కానీ రిలీజ్ కు రెడీ అయిపోయింది అనే వార్తలు వింటుంటాం. అందులోను ఎలా రిలీజ్ చేయబోతున్నారు..? అనే విషయం కూడా ఎవరికి వారే పుకార్లు సృష్టించేసరికి మేకర్స్ దిగిరావాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి మెగాహీరో వైష్ణవ్ తేజ్ - డైరెక్టర్ క్రిష్ సినిమా విషయంలో ఏర్పడింది. ఏంటంటే.. వైష్ణవ్ డెబ్యూ మూవీ ఉప్పెన విడుదలకు ముందే లాక్డౌన్ సమయంలో క్రిష్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. వైష్ణవ్ - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా క్రిష్ ఓ గ్రామీణ నేపథ్యం కలిగిన కథతో సినిమా రూపొందించాడు. అదికూడా కొండపోలం అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు కొండపోలం, జంగిల్ బుక్ అనే పేర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో క్రిష్ ఈ సినిమాను త్వరలో ఓటిటి రిలీజ్ చేస్తాడని వార్తలు ముమ్మరంగా ప్రచారం జరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ పుకార్లకు చెక్ పెట్టడానికి క్రిష్ త్వరలోనే సినిమా టైటిల్ రివీల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయాలనీ భావిస్తున్నట్లు టాక్. చూడాలి మరి ఏం అప్డేట్ ఇస్తారో..!
Tags:    

Similar News