• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలయ్య సినిమాతో శ్రుతి...

బాలయ్య సినిమాతో శ్రుతి హాసన్ కి హ్యాట్రిక్ హిట్ పడేనా?

By - Tupaki Desk
Update: 2021-11-13 08:55 GMT
టాలీవుడ్ లో మాస్ యాక్షన్ సినిమాలు ఎవరు బాగా తీయగలరంటే నిన్నమొన్నటి వరకూ వినాయక్ .. బోయపాటి పేర్లు మాత్రమే వినిపించాయి. 'క్రాక్' సినిమా తరువాత ఆ జాబితాలోకి గోపీచంద్ మలినేని కూడా చేరిపోయాడు. ఒక మాస్ యాక్షన్ సినిమాకి కావలసిన లక్షణాలు 'క్రాక్'లో పుష్కలంగా కనిపిస్తాయి. అందువల్లనే ఆ సినిమా మాస్ ఆడియన్స్ కి అంతగా దగ్గరైంది. బాక్సాఫీస్ తో కలిసి భారీ వసూళ్లను షేర్ చేసుకుంది. గోపీచంద్ మలినేని ట్రీట్మెంట్ తన బాడీ లాంగ్వేజ్ కి దగ్గరగా ఉండటంతో బాలకృష్ణ పిలిచిమరీ ఛాన్స్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన కథపైనే గోపీచంద్ మలినేని కసరత్తు చేస్తూ వచ్చాడు.

ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నాయికగా శ్రుతి హాసన్ చేయనుందనే వార్తలు ఒక పక్కన .. ఆమె ఒప్పుకోలేదనే టాక్ మరో పక్కన షికారు చేస్తూ వచ్చాయి. మొత్తానికి రీసెంట్ గానే తాను ఈ సినిమా చేస్తున్నట్టుగా శ్రుతి హాసన్ ఒక ట్వీట్ చేసింది. ఈ రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. వినాయక్ క్లాప్ తో ఈ సినిమా షూటింగు లాంఛనంగా మొదలైంది. ఈ కార్యక్రమంలో శ్రుతి హాసన్ కూడా పాల్గొంది. గోపీచంద్ మలినేనితో ఆమె చేస్తున్న మూడో సినిమా ఇది. ఇంతకుముందు ఆమె 'బలుపు' .. 'క్రాక్' సినిమాలను చేసింది. ఈ రెండు సినిమాలు కూడా మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నవే.

రవితేజకి .. గోపీచంద్ మలినేనికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఎందుకంటే గోపీచంద్ మలినేని కెరియర్ మొదలైందే రవితేజ 'డాన్ శీను' సినిమాతోనే. గోపీచంద్ మలినేని ఇంతవరకూ చేసినవి అరడజను సినిమాలైతే, వాటిలో మూడు సినిమాలు రవితేజతో చేసినవే. 'బలుపు' సినిమా కోసం మొదటిసారిగా రవితేజ జోడీగా ఆయన ' శ్రుతి హాసన్ ను తీసుకున్నాడు. 2013లో వచ్చిన ఆ సినిమా మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. మంచి వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత చేసింది ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన 'క్రాక్'. తెలుగులో ఒక మంచి హిట్ తో రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న శ్రుతికి ఈ సినిమా ప్లస్ అయింది.

అందువల్లనే ఆమె గోపీచంద్ మలినేని మాట కాదనలేక డేట్లు సర్దుబాటు చేసిందని అంటున్నారు. ఇటు గోపీచంద్ మలినేనికి .. అటు శ్రుతి హాసన్ కి ఇద్దరికీ కూడా బాలకృష్ణతో ఇదే మొదటి సినిమా. అయితే ఇక్కడున్న ప్రత్యేకత ఏమిటంటే, బోయపాటితో మూడో సినిమాను బాలకృష్ణ పూర్తిచేసుకుని వస్తే, శ్రుతి హాసన్ .. గోపీచంద్ మలినేనితో తన మూడో సినిమా చేస్తోంది. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ పడుతుందనే నమ్మకంతో ఆమె ఉంది. ఇక బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కీ .. ఆయన సినిమా నుంచి అభిమానులు ఆశించే అంశాలతో గోపీచంద్ మలినేని ఈ కథను రెడీ చేసుకున్నాడు. అందువలన ఆయన కూడా ఈ సినిమాతో తప్పకుండా హైటి కొడతాననే బలమైన నమ్మకంతోనే ఉన్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో!
Tags:    
  • Shrutihaasan 
  • Nandamuri Balakrishna 
  • Gopichand Malineni 
  • NBK107 

Similar News

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS