#PSPKRana చిత్రాన్ని రీ షూట్ చేస్తారా..?

Update: 2021-07-18 03:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైన్ లో పెట్టిన అర డజను సినిమాలలో 'అయ్యప్పనుమ్ కోశియుమ్' రీమేక్ ఒకటి. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని తెలుగులో రానా దగ్గుబాటి తో కలసి చేస్తున్నారు. సాగర్ కె.చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించడంతో పాటుగా మెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే నలభై శాతానికి పైగా షూటింగ్ పూర్తయ్యింది. అయితే ఇప్పటి వరకు షూటింగ్ జరిపిన సీన్స్ లో కొన్నింటిని రీ షూట్ చేయనున్నారని ఓ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది.

#PSPKRana కోసం వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పనుకున్నట్లు ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగానే ప్రసాద్ ఈ సినిమా నుండి బయటకు వెళ్లారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో తెలుగులో 'భరత్ అనే నేను' చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన రవి కె.చంద్రన్ ను తీసుకున్నారట. అయితే ప్రసాద్ మూరెళ్ల ఆధ్వర్యంలో చిత్రీకరించిన సన్నివేశాలను రీ షూట్ చేయాలని చూస్తున్నారట. ఇదే కనుక నిజమైతే 'ఏకే' రీమేక్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

'అయ్యప్పనుమ్ కోశియుమ్' రీమేక్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రాన్ని తిరిగి స్టార్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు రీ షూట్ అంటే.. వీరమల్లు చిత్రీకరణ పై కూడా ప్రభావం చూపుతుంది. ఇకపోతే #PSPKRana వచ్చే ఏడాది సంక్రాంతి కి.. 'వీరమల్లు' 2022 సమ్మర్ కి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సినిమా షూటింగ్స్ ని బట్టి #PSPK28 చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని హరీష్ శంకర్ చూస్తున్నారని తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో పవన్ షూటింగ్ ప్లాన్ ఎలా ఉండబోతుందో చూడాలి.
Tags:    

Similar News