పొట్టి స్కర్ట్ లో సెల్ఫీతో పిచ్చెక్కిస్తున్న యంగ్ బ్యూటీ!..
ప్రస్తుతం హీరోయిన్స్ తమ గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా తమ కెరియర్లో జరుగుతున్న పలు సందర్భాలకు సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.;
ప్రస్తుతం హీరోయిన్స్ తమ గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా తమ కెరియర్లో జరుగుతున్న పలు సందర్భాలకు సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఫ్రెండ్స్ తో వెకేషన్ కి వెళ్లిన ఫోటోలను.. జిమ్ లో కష్టపడిపోతున్న ఫోటోలను అలాగే లిఫ్టులో సెల్ఫీ తీసుకుంటూ ఇలా ఎన్నో రకాల ఫోటోలను పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పొట్టి స్కర్ట్ ధరించి తన అందాలతో పిచ్చెక్కించే ప్రయత్నం చేసింది యంగ్ బ్యూటీ ఖుషి కపూర్.
దివంగత నటీమణి , అతిలోకసుందరి అందాల తార శ్రీదేవి చిన్న కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఈమె తండ్రి ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ .. సోదరి ప్రముఖ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్. అక్క బాటలోనే ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నం చేస్తోంది ఖుషీ కపూర్. అందులో భాగంగానే ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరొకవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా మినీ స్కర్ట్ ధరించిన ఈమె తన ఫ్రెండ్స్ తో చిల్ అవుతున్న ఫోటోలను అలాగే సెల్ఫీ తీసుకుంటున్న ఫోటోలను కూడా పంచుకుంది.
అంతేకాదు జిమ్ లో తెగ కష్టపడిపోతూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది ఖుషీ కపూర్. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. అభిమానులు హార్ట్ ఎమోజీలతోపాటు ఫైర్ ఎమోజీలను కూడా తమ అభిప్రాయాలుగా పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఖుషి కపూర్ షేర్ చేసిన ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
2000 నవంబర్ 5న మహారాష్ట్రలోని ముంబైలో శ్రీదేవి , బోనీ కపూర్ దంపతులకు రెండవ సంతానంగా జన్మించింది ఖుషీ కపూర్. అక్కడే ధీరూభాయ్ అంబానీ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఈమె.. లండన్ ఫిలిమ్స్ స్కూల్లో నటనలో శిక్షణ తీసుకుంది. ఇక 2023లో జోయా అక్తర్ దర్శకత్వంలో ప్రసిద్ధ ఆర్చీస్ కామిక్స్ సిరీస్ ఆధారంగా తెరకెక్కిన ది ఆర్చీస్ లో సుహానాఖాన్, రోహిత్ చెత్రి లతో కలిసి ఖుషీ కపూర్ నటనా రంగ ప్రవేశం చేసింది.
2020లో స్పీక్ అప్ అనే షార్ట్ ఫిలిం ద్వారా తన కెరీర్ ను ప్రారంభించిన ఈమె.. ఇందులో నైనా అనే పాత్ర పోషించి ఆకట్టుకుంది. ఇక గత ఏడాది లవ్ యాపా చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఖుషీ కపూర్.. ఆ తర్వాత నదానియన్ అనే సినిమాలో కూడా నటించింది. సినిమాలే కాకుండా 2024 లో వచ్చిన ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్ టీవీ సీరియల్ లో స్పెషల్ పాత్ర పోషించింది. ఇక ఈమధ్య వరుస చిత్రాలలో నటించే ప్రయత్నం చేస్తున్న ఈమె అందులో భాగంగానే సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది.