బ‌న్నీ క్రేజీ స్టేట్‌మెంట్..బ్లాక్ బ‌స్ట‌ర్ కాదు..బాస్ బ‌స్ట‌ర్‌..!

సంక్రాంతి బ‌రిలో జ‌న‌వ‌రి 12న విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద అనూహ్య విజ‌యాన్ని సాధిస్తూ వ‌రుస‌గా రికార్డుల్ని తిర‌గ‌రాస్తోంది.;

Update: 2026-01-20 10:39 GMT

సంక్రాంతికి బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ `ది రాజాసాబ్‌` నుంచి యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి న‌టించిన ఫ్యామిలీ కామెడీ డ్రామా `అన‌గ‌న‌గా ఒక రాజు` వంటి సినిమాలు విడుద‌ల‌య్యాయి. వీటితో పాటే మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్‌గారు` ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ప్రాజెక్ట్ ప్రారంభ ప్ర‌క‌ట‌న వీడియో నుంచి ప్ర‌మోష‌న్స్‌ని వినూత్నంగా ప్రారంభించిన అనిల్ రావిపూడి సినిమాని కూడా అంతే వినూత్నంగా తెర‌కెక్కించాడు.

సంక్రాంతి బ‌రిలో జ‌న‌వ‌రి 12న విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద అనూహ్య విజ‌యాన్ని సాధిస్తూ వ‌రుస‌గా రికార్డుల్ని తిర‌గ‌రాస్తోంది. అనిల్ మార్కు ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, కామెడ అంశాల‌తో రూపొందిన ఈ మూవీలో వింటేజ్ చిరుని ప‌రిచ‌యం చేయ‌డంతో అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. చాలా కాలం త‌రువాత చిరు మార్కు టైమింగ్‌, వింటేజ్ చిరు స్టైల్ ని మ‌ళ్లీ ప‌రిచ‌యం చేయ‌డంతో ప్రేక్ష‌కులు `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్‌గారు`కు బ్రహ్మ‌ర‌థం ప‌డుతున్నారు. చిర‌కు తోడు వెంకీ మామ కూడా వెంకీ గౌడ‌గా రంగంలోకి దిగ‌డంతో థియేట‌ర్ల‌లో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది.

సంక్రాంతి సీజ‌న్ కావ‌డం, ఫ్యామిలీస్‌కి విప‌రీతంగా న‌చ్చ‌డంతో రికార్డు స్థాయిలో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు. పండ‌గ సెల‌వులు కూడా వారం రోజులు రావ‌డంతో పిల్ల‌ల‌తో ఫ్యామిలీస్ థియేట‌ర్ల‌కు పోటెత్తారు. దీంతో మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్‌గారు` బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర‌ద‌ని సృష్టిస్తూ చిరు సినిమాల్లో స‌రికొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు రూ.300 కోట్లు రాబ‌ట్టి అత్యంత వేగంగా ఈ ఫీట్‌ని సాధించిన ప్రాంతీయ సినిమాగా నిలిచింది. ప‌ది రోజుల్లోనే ఈ ఘ‌న‌త‌ని సాధించ‌డంతో స‌ర్వ‌త్రా టీమ్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాస్ మూవీ `మ‌న శంక‌రవ‌ర‌ప్ర‌సాద్‌గారు`పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. `పుష్ప 2` ప్ర‌మోష‌న్స్ కోసం ఫ్యామిలీతో క‌లిసి జ‌పాన్ వెళ్లిన బ‌న్నీ అక్క‌డ ప‌ర్య‌టించి ఇండియాకు తిరిగొచ్చాడు. వ‌చ్చి రాగానే బాస్ సినిమా చూసేసి త‌న‌దైన స్టైల్లో ప్ర‌శంస‌లు కురిపిస్తూ మినీ రివ్యూ ఇచ్చాడు. `మ‌న శంక‌రవ‌ర‌ప్ర‌సాద్‌గారు` టీమ్ స‌భ్యులంద‌రికీ శుభాకాంక్ష‌లు. బాస్ ఈజ్‌బ్యాక్‌. మ‌న మెగాస్టార్ చిరంజీవిగారు మ‌ళ్లీ తెర‌పై క‌నిపించ‌డం చూసి చాలా ఆనందంగా ఉంది. వింటేజ్ వైబ్స్ `అంటూ కోట్ చేశాడు.

వెంకీమామ‌గారు షోను రాక్ చేశారు అంటూ క‌న్న‌డ‌లో వెంకీ గౌడ అద్భుతం చేశార‌న్నారు. న‌య‌న‌తార గారి గ్రేసియ‌స్ ప్ర‌జెన్స్‌, అంద‌రి న‌టుల ఎన‌ర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌..మ‌రీ ముఖ్యంగా సంక్రాంతి బుల్లిరాజు యాక్టింగ్ అంటూ న‌వ్వుతున్న ఎమోజీని జ‌త చేశారు. విజిల్ వేసేంత వ‌ర్త్ ఉన్న హుక్ స్టెప్‌, మెగా విక్ట‌రీ..త‌దిత‌ర సాంగ్స్‌.. ఈ విష‌యంలో భీమ్స్ సిసిరోలియోగారికి కంగ్రాట్స్‌. ఈ సినిమాకు వ‌ర్క్ చేసిన టెక్నీషియ‌న్స్ అంద‌రికి మ‌రీ ముఖ్యంగా ప్రొడ్యూస‌ర్స్ మా అత్యంత ప్రియ‌మైన క‌జిన్ సుష్మిత కొణిదెల‌, సాహు గార‌పాటి గారికి కంగ్రాట్స్ అన్నారు.

ఇక డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడిని పొగ‌డ్త‌ల్లో ముంచెత్తుతూ బిగ్ కంగ్రాట్యులేష‌న్ సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ మిష‌న్ అనిల్ రావిపూడిగారు. సంక్రాంతికి వ‌స్తారు హిట్టు కొడ‌తారు రిపీటు అంటూ అనిల్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. `మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు` సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ కాద‌ని.. సంక్రాంతి బాస్ బ‌స్ట‌ర్ అంటూ స‌రికొత్త నిర్వచ‌నం ఇచ్చారు. బ‌న్నీ షేర్ చేసిన పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Tags:    

Similar News