పవన్ - రవితేజలలో పోలీస్ ఎవరు?..గ్యాంగ్ స్టర్ ఎవరు?
గత కొన్ని రోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - మాస్ మహారాజ్ రవితేజ కలిసి ఒక మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్నారనే వార్త ఈ మధ్య బాగా షికారు చేస్తోంది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ దాదాపు రెండేళ్ళ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చి సినిమాల జోరు పెంచారు. ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' - క్రిష్ డైరెక్షన్ లో ఒక సినిమా - హరీష్ శంకర్ తో ఒక సినిమా లైన్లో పెట్టాడు. మరోవైపు 'నేల టిక్కెట్టు' - 'డిస్కోరాజా' వంటి వరుస పరాజయాల తర్వాత కూడా రవితేజ స్పీడ్ మాత్రం తగ్గలేదు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' - రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాను ట్రాక్ లో పెట్టాడు. అయితే ఇప్పుడు ఒక తమిళ రీమేక్ సినిమాలో పవన్ కళ్యాణ్ - రవితేజలు కలిసి యాక్ట్ చేయబోతున్నారట.
ఇది తమిళంలో ఘన విజయం సాధించిన 'విక్రమ్ వేదా' సినిమాకి రీమేక్. ఆర్.మాధవన్ - విజయ్ సేతుపతి నటించగా తమిళ్‌లో సూపర్ డూపర్ హిట్ అయిన ‘విక్రమ్ వేదా’ సినిమాకి పుష్కర్ - గాయత్రి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మాధవన్ పోలీస్ ఆఫీసర్ 'విక్రమ్' - విజయ్ సేతుపతి 'గ్యాంగ్ స్టర్ వేద' పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిందీ చిత్రం.. కొద్ది కాలంగా ఈ చిత్రాన్ని పలు భాషల్లో రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - మాస్ మహారాజా రవితేజ దగ్గరికి వచ్చి ఆగిందనేది ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ చిత్రానికి 'గోపాల గోపాల' ఫేమ్ పార్థసారథి (డాలీ) దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. పవన్ - రవితేజ ఇద్దరిలో ఎవరు ఏ పాత్ర చేయనున్నారనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎవరు ఏ పాత్ర చేస్తే బాగుంటుందని అభిమానుల్లో ఇప్పటికే చర్చ స్టార్ట్ అయిపోయింది.
పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా - రవితేజ గ్యాంగ్ స్టర్ గా అనిపించనున్నారా.. లేదా పవన్ గ్యాంగ్ స్టర్ గా కనిపించి రవితేజ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాన్ని 'నేల టిక్కెట్టు' - 'డిస్కోరాజా' వంటి చిత్రాల్ని నిర్మించి భారీ స్థాయిలో నష్టపోయిన రామ్ తాళ్లూరి నిర్మించనున్నట్టు తెలిసింది. రామ్ తాళ్లూరికి - పవన్ కు మధ్య మంచి అనుబంధం వుంది. ఆ అనుబంధం కారణంగానే పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన రామ్ తాళ్లూరిని అప్పుల నుంచి బయట పడేయడం కోసమే పవన్ కల్యాణ్ ఈ చిత్రాన్ని చేయబోతున్నట్టు కూడా ఇండస్ట్రీ లో టాక్ నడుస్తోంది. మరి పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.