దిల్ రాజు కాన్ఫిడెన్స్ వెనకున్న కారణం?
ఈ మూవీ కంటెంట్‌తో పాటు కమర్షియల్‌గా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లని రాబడుతుందనే బలమైన నమ్మకం కలగడం వల్లే దిల్ రాజు ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌ని ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నారనే టాక్ వినిపిస్తోంది.;
విధి చిత్రం అంటే ఇదే. ఎవరైతే వద్దని రిజెక్ట్ చేశారో వారే కావాలని వెంటపడేలా చేస్తుంది. నమ్మకం లేదన్న వారే ఫుల్ కాన్ఫిడెన్స్‌తో సపోర్ట్‌గా నిలబడేలా చేస్తుంది. అదే డెస్టినీ అంటే. వివరాల్లోకి వెళితే.. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నటించిన లేటెస్ట్ మూవీ `గాయపడ్డ సింహం`. ఈ మూవీ ద్వారా కశ్యప్ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రీసెంట్‌గా విడుదల చేసిన టీజర్‌తో సినిమాపై అంచనాలు పెంచేశారు. ఫరీయా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. అమెరికా వెళ్లాలనుకుని విశ్వప్రయత్నాలు చేసే ఓ యువకుడి కథగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
సెటైరికల్ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌తో ఆకట్టుకోవడం, టైటిల్ కూడా వైరల్ కావడంతో దీనికి బిజినెస్ పరంగా మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ మూవీకి సంబంధించిన థియేట్రికల్ రైట్స్‌ని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ హక్కుల్ని కూడా దిల్ రాజు సొంతం చేసుకోవడం గమనార్హం. భారీ సినిమాలని నిర్మించే దిల్ రాజు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌తో పాటు ఓవర్సీస్ హక్కుల్ని ఫ్యాన్సీ రేటుకు, అది కూడా నాన్ రిఫండబుల్ పద్దతిలో సొంతం చేసుకోవడానికి బలమైన రీజనే ఉందట.
ఈ మూవీ కంటెంట్‌తో పాటు కమర్షియల్‌గా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లని రాబడుతుందనే బలమైన నమ్మకం కలగడం వల్లే దిల్ రాజు ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌ని ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. తరుణ్ భాస్కర్ నటించిన `ఓం శాంతి శాంతి శాంతి శాంతిః` బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది. అయినా దాన్ని పట్టించుకోకుండా `గామపడ్డ సింహం`లో ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేయగల వైబ్‌ని గమనించిన దిల్ రాజు ఈ మూవీ హక్కుల్ని ఫ్యాన్సీరేటుకు తీసుకున్నారని, ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తుందని ఆయన బలంగా నమ్ముతున్నారని ఇన్ సైడ్ టాక్.
అయితే ఇదే సమయంలో తరుణ్ భాస్కర్ చేసిన ఫస్ట్ మూవీ చర్చనీయాంశంగా మారుతోంది. ఈ మూవీని ముందు దిల్ రాజుకే చూపించారు. అప్పట్లో ఇది పెద్దగా వర్కవుట్ కాదని, రిలీజ్ చేయలేనని దిల్ రాజు అన్నారట. దాంతో `పెళ్లిచూపులు` సురేష్ బాబు కాంపౌండ్‌లోకి వచ్చి చేరింది. అలా థియేటర్లలోకి వచ్చింది. హిట్ అనిపించుకుని దర్శకుడిగా తరుణ్ భాస్కర్‌కు మంచి పేరు తెచ్చి పెట్టింది. మళ్లీ ఇన్నాళ్లకు `గాయపడ్డ సింహం`ని కోరి మరీ దిల్ రాజు రిలీజ్ చేయడానికి ఫ్యాన్సీ రేట్ ఇచ్చి ముందుకు రావడం ఆసక్తిని రేకెత్తిస్తోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. డెస్టినీ అంటే ఇదే అని ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవడం అని దీన్నే అంటారని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. రిలీజ్‌కు ముందే చర్చనీయాంశంగా మారిన ఈ సినిమా సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.