త‌న క‌ళ్ల ముందే తండ్రిని పెళ్లాడిన ఆమెను చూసి భ‌గ‌భ‌గ మ‌రిగిపోయిన హీరో!

బాలీవుడ్ లో చాలా కుటుంబ క‌థ‌లు ప్ర‌జ‌లు ఊహించిన దానికంటే భిన్నంగా ఉంటాయి. ల‌గ్జ‌రీ జీవితాల వెన‌క క‌ష్టాలు, క‌న్నీళ్లు, ద్రోహాలు, ఆక్రోశాలు కూడా ఉంటాయి.;

Update: 2026-02-19 10:30 GMT

బాలీవుడ్ లో చాలా కుటుంబ క‌థ‌లు ప్ర‌జ‌లు ఊహించిన దానికంటే భిన్నంగా ఉంటాయి. ల‌గ్జ‌రీ జీవితాల వెన‌క క‌ష్టాలు, క‌న్నీళ్లు, ద్రోహాలు, ఆక్రోశాలు కూడా ఉంటాయి. త‌న తండ్రి త‌న త‌ల్లికి అన్యాయం చేస్తున్నాడ‌ని తెలిసీ, రెండో పెళ్లి పేరుతో త‌మ‌ను మోసం చేసాడ‌ని తెలిసీ.. తీవ్ర ఆవేద‌న‌కు క‌ల‌త‌కు గురైన చిన్నారుల మ‌న‌సుల్లో ఉండే ఘాఢ‌మైన ఫీలింగ్స్ ని బ‌య‌ట‌పెట్ట‌డానికి ద‌శాబ్ధాలు పట్ట‌వ‌చ్చు. హీరోలుగా ఎదిగాక కూడా చిన్న‌నాటి ఘ‌ట‌న‌లు త‌మ‌లో ఆందోళ‌న‌కు కార‌ణం కావొచ్చు. అలాంటి ఒక ప‌రిస్థితిని ఎదుర్కొన్నాడు స‌ల్మాన్ ఖాన్. త‌న తండ్రి సలీమ్ ఖాన్ త‌న క‌ళ్ల ముందే హెలెన్ అనే మ‌రో యువ‌తిని పెళ్లాడ‌టం నిజంగా స‌ల్మాన్ గుండెల్ని మ‌రిగించింది. అత‌డు ఆ స‌మ‌యంలో భ‌గ‌భ‌గ మ‌రిగిపోయాడు. కానీ అప్పటికి ఏమీ తెలియ‌ని ప‌సివ‌య‌సు. దాంతో తండ్రిని ఏమీ అన‌లేక‌పోయాడు. ఈ విష‌యాల‌ను చాలా ఇంట‌ర్వ్యూల‌లో అంగీక‌రించాడు కూడా.

బాలీవుడ్ చరిత్రలో సల్మాన్ ఖాన్ కుటుంబంలో మెలో డ్రామా అంద‌రికీ తెలియ‌క‌పోవ‌చ్చు. కానీ ఆ కుటుంబం ఒకే తాటిపైకి రావడం అనేది అంత సులభంగా జరగలేదు. తన తల్లిపై స‌ల్మాన్‌కు ఉన్న అమితమైన ప్రేమ.. తన తండ్రి చేసిన ప‌నికి ఆ సమయంలో అనుభవించిన బాధ సల్మాన్ పాత ఇంటర్వ్యూలలో స్పష్టంగా కనిపిస్తుంది.

నాటి విష‌యాల‌ను స‌ల్మాన్ గుర్తు చేసుకున్న ప్ర‌తిసారీ త‌న బాధ‌ను వ్య‌క్తం చేసాడు. భాయ్ ఎప్పుడూ తనను తాను త‌ల్లిచాటు బిడ్డ (మామాస్ బాయ్) అని చెప్పుకోవడానికి వెనుకాడలేదు. తన తండ్రి అకాల‌ నిర్ణయం వల్ల తన తల్లి పడ్డ బాధ‌ సల్మాన్‌ను ఎక్కువగా కలిచివేసింది. ``మా అమ్మ సంతోషంగా లేకపోతే నేను అస్సలు భరించలేను. నాన్న రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె మ‌న‌సు చాలా గాయపడింది. రాత్రిపూట నాన్న కోసం ఆమె ఎదురుచూస్తూ ఉండటం నాకు అస్సలు నచ్చేది కాదు` అని సల్మాన్ ఒకసారి ఇంట‌ర్వ్యూలో అంగీకరించారు.

తన తల్లి పడుతున్న బాధను చూసి, తన తండ్రిపై సల్మాన్ చాలా కాలం పాటు కోపాన్ని పెంచుకున్నారు. అయితే ఈరోజుల్లో త‌న తండ్రి రెండో భార్య హెలెన్ తో చాలా మంచి అనుబంధం ఉండి ఉండొచ్చు కానీ 80వ దశకంలో పరిస్థితి ఇలా లేదు. సల్మాన్, అత‌డి సోదరులు చాలా కాలం పాటు హెలెన్‌తో మాట్లాడలేదు. తమ కుటుంబ ప్రశాంతతను దెబ్బతీసిన వ్యక్తిగా ఆమెను చూస్తూ తమ తల్లికి అండగా నిలబడ్డారు. అయితే హెలెన్ తమ కుటుంబం విష‌యంలో చూపిస్తున్న గౌరవం.. ముఖ్యంగా తన తల్లి (సల్మా) ఆమెను మనస్ఫూర్తిగా అంగీకరించడం చూశాక సల్మాన్ ఆలోచనా దృక్పథం మారింది.

తండ్రి సలీమ్ ఖాన్‌తో రాజీ..

మొదట్లో కోపం ఉన్నా కానీ తన తండ్రిపై ఉన్న గౌరవం సల్మాన్‌ను శాంతింపజేసింది. తన తండ్రి ఎప్పుడూ కుటుంబాన్ని వదిలేయ‌లేదని అత‌డు గ్రహించారు. మా నాన్న మాకు ఒక లాజికల్ వివరణ ఇచ్చారు... తనకు అమ్మ అంటే ఇష్టమని.. అలాగే హెలెన్ ఆంటీ అన్నా ఇష్టమని.. ఇద్దరినీ జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పారు. నేను పెరిగే కొద్దీ ఆయనలోని నిజాయితీని అర్థం చేసుకున్నాను అని చెప్పారు.

ప్రస్తుతం ముంబైలో ఒక ఆదర్శవంతమైన ఉమ్మడి కుటుంబంగా ఖాన్ కుటుంబం గుర్తింపు పొందింది. స‌ల్మా- హెలెన్ వీరిద్దరూ కలిసి అనేక కార్యక్రమాల్లో కనిపిస్తారు. వారి మధ్య ఒక నిజమైన స్నేహ బంధం ఉంది. సల్మాన్ ఇప్పుడు హెలెన్‌ను ఎంతో గౌరవిస్తారు. తన తల్లి కన్నీళ్లు చూడలేకపోయిన ఆనాటి కుర్రాడు నేడు తన ఇద్దరు తల్లులను సమానంగా ప్రేమిస్తూ కుటుంబాన్ని నడిపిస్తున్నారు. భార‌త‌దేశంలో గొప్ప సూప‌ర్ స్టార్ గా ఎదిగిన స‌ల్మాన్ ఖాన్ ఎంతో ఒదిగి ఉండే స్వ‌భావంతో అంద‌రి మ‌న‌సులు గెలుచుకుంటున్నాడు. త‌న కుటుంబంలో సంక్షోభం ఎదురైన స‌మ‌యంలో అన్నిటినీ ఎదురొడ్డి నిల‌బ‌డ్డాడు. స్టార్ గా ప‌రివర్త‌న చెందాడు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే,.. స‌ల్మాన్ ఖాన్ `సికంద‌ర్` సినిమా త‌ర్వాత `ది బ్యాటిల్ ఆఫ్ గ‌ల్వాన్` అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. అపూర్వ ల‌ఖియా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇంత‌కుముందు విడుద‌లైన టీజ‌ర్ ఆస‌క్తిని క‌లిగించిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News