బ‌న్నీ కోసం లోకేష్ చిట్ట చివ‌రి క‌థ‌!

ఇక్క‌డే తెలివిగా ఓ గేమ్ కూడా ఆడాడు. వెంట వెంట‌నే యాక్షన్ సినిమాలు చూడ‌టం ప్రేక్ష‌కులు బోరింగ్ ఫీల్ అవుతార‌ని తాను రిలాక్స్ అయ్యాడు.;

Update: 2026-02-19 08:30 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 23వ చిత్రం పాన్ ఇండియా సంచ‌ల‌నం లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు మ‌రో భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ తో రావ‌డం ఖాయం. ఇదే ఏడాది ఆ చిత్రం మొద‌లు కానుంది. బ‌న్నీ అట్లీ ప్రాజెక్ట్ నుంచి రిలీవ్ అవ్వ‌గానే లోకేష్ సినిమా షూటింగ్ లోనే జాయిన్ అవుతాడు. ప్ర‌స్తుతం ఆప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీప్రోడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. లోకేష్ హీరోగా `డీసీ` సినిమాలో న‌టిస్తూనే ఈ ప‌నులు చూస్తున్నాడు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. లోకేష్ స్టోరీ బ్యాంక్ నుంచి ఎన్న‌వ క‌థ‌ను తీస్తున్నాడు? అన్న‌దే ఆస‌క్తిక‌రం.

`లియో` సినిమా చేస్తోన్న స‌మ‌యంలో త‌న వ‌ద్ద ఓ ఆరు క‌థ‌లు సిద్దంగా ఉన్నాయ‌ని వెల్ల‌డించారు.అవ‌న్నీ కూడా బౌండెడ్ స్క్రిప్ట్ తో సిద్దంగా ఉన్నాయి. హీరో ఒకే చెప్పాలిగానీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెట్ట‌డానికి సిద్దంగా ఉన్న స్టోరీలు. వీటి ఆధారంగానో మ‌రో ఆరేళ్ల పాటు త‌న నుంచి కేవ‌లం హింస‌తో కూడిన చిత్రాలు మాత్ర‌మే వ‌స్తాయ‌ని...క‌థ‌ల కోసం వెతుక్కోవాల్సిన ప‌నిలేద‌ని, కొత్త‌గా ఎలాంటి అంచ‌నాలు పెట్టుకోవ‌ద్ద‌ని ముందే చెప్పేసాడు. ప్రేక్ష‌కుడు థియేట‌ర్ కు ఓ ర‌క‌మైన అంచ‌నాల‌తో వ‌స్తే ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌న్న‌ది లొకేష్ కి ఇప్ప‌టికే ఓ అనుభ‌వంగా ఎదురైంది.

అందుకే త‌దుప‌రి చిత్రాలు కూడా ఎలా ఉంటాయి? అన్న‌ది హింట్ ఇచ్చేసాడు. ఇక్క‌డే తెలివిగా ఓ గేమ్ కూడా ఆడాడు. వెంట వెంట‌నే యాక్షన్ సినిమాలు చూడ‌టం ప్రేక్ష‌కులు బోరింగ్ ఫీల్ అవుతార‌ని తాను రిలాక్స్ అయ్యాడు. కెప్టెన్ కుర్చీ నుంచి దిగీ న‌టుడిగా మ్యాక‌ప్ వేసుకున్నాడు. ప్ర‌స్తుతం `డీసీ` అనే సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడు. ఇది పూర్త‌యిన త‌ర్వాత బ‌న్నీతో సినిమా మొద‌లు పెడ‌తాడు. మ‌రి బ‌న్నీ కోసం తీసే క‌థ ఏది అంటే ఆర్డ‌ర్ ప్ర‌కారం చూస్తే మూడు , నాలుగు స్క్రిప్ట్ అవ్వాలి. కానీ బ‌న్నీ ఇమేజ్ ను , భ‌విష్య‌త్ ను దృష్టిలో పెట్టుకు చివ‌రిగా తెర‌కెక్కించాలి అనుకున్న ఆర‌వ స్క్రిప్ట్ నే ముందుగా తీస్తున్నాడ‌ని స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది.

Tags:    

Similar News