క్రేజీ ప్రొడక్షన్ హౌస్‌లో ఏం జరుగుతోంది?
టాలీవుడ్‌లో చాలా వరకు క్రేజీ ప్రొడక్షన్ కంపనీలున్నాయి. అందులో కొన్ని మాత్రమే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నిర్మిస్తున్నా నిత్యం లైమ్ లైట్‌లో ఉంటున్నాయి.;
టాలీవుడ్‌లో చాలా వరకు క్రేజీ ప్రొడక్షన్ కంపనీలున్నాయి. అందులో కొన్ని మాత్రమే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నిర్మిస్తున్నా నిత్యం లైమ్ లైట్‌లో ఉంటున్నాయి. అలాంటి ప్రొడక్షన్ హౌస్‌లలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒకటి. ఈ బ్యానర్‌పై మినిమమ్ బడ్జెట్ మూవీస్, భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ. ఈ ఏడాది `అనగనగ ఒక రాజు` సినిమాతో శుభారంభాన్ని అందుకున్న సితార నాగవంశీ ఈ ఏడాది మరిన్ని క్రేజీ సినిమాలని ప్రేక్షకులకు అందించబోతున్నారు.
`కాంతారా` స్టార్ రిషభ్ శెట్టి - అశ్విన్ గంగరాజు కాంబినేషన్‌లో ఓ సినిమా, అల్లరి నరేష్ `ఆల్కహాల్`, రోషన్‌తో రొమాంటిక్ లవ్ డ్రామా `ఏమో ఏమో ఇదీ`, అఖిల్ అక్కినేనితో `లెనిన్` మూవీలని నిర్మిస్తున్న సితార నాగవంశీ ఇదే ఏడాది కోలీవుడ్ స్టార్ సూర్య, యంగ్ టాలెంటెడ్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో ఓ భారీ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాని నిర్మిస్తున్నారు. దీనికి `విశ్వనాథం అండ్ సన్స్` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. వీటితో పాటు ఆయన నిర్మించిన కామెడీ ఎంటర్‌టైనర్ `ఫంకీ`. మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ కథానాయకుడిగా నటించిన విషయం తెలిసిందే.
కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించి ఈ మూవీని అనుదీప్ కెవీ రూపొందించారు. మొదటి నుంచి ఈ సినిమాపై నాగవంశీ భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో పాటు నమ్మకం పెట్టుకున్నారు. ఎవరు ఎన్ని కారణాలు చెప్పినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఖచ్చింతంగా మ్యాజిక్ చేస్తుందని ఆయన బలంగా నమ్మారు. దానికి అనుగునంగానే రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లని మార్చి భారీ స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేశారు. ఫలితం సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. వారం తిరక్కుండానే థియేటర్లలోంచి వెళ్లిపోయి షాక్ ఇచ్చింది.
దీంతో సితారలో భారీ మార్పులకు ఆయన శ్రీకారం చుట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బ్యానర్‌లో నిర్మాణంలో ఉన్న సినిమాలని ఆయన మళ్లీ క్షుణ్ణంగా పరిశీలస్తున్నారని ఇన్ సైడ్ టాక్. సినిమా నేపథ్యంలో రూపొందిన మూవీస్ చాలా వరకు పరాజయాల్నే సొంతం చేసుకున్నాయి. దర్శకుడు వంశీ రూపొందించిన `సితార`, దాసరి నారాయణ రావు తెరకెక్కించిన `శివరంజని` మినహా ఇంత వరకు సినిమా నేపథ్యంలో రూపొందిన చిత్రాలేవీ సక్సెస్ అయిన దాఖలాలు లేవు.
గతంలో రవితేజతో పూరి జగన్నాథ్ రూపొందించిన `నేనింతే` మూవీ కూడా ఆశించిన ఫలితాన్ని అందించలేక డిజాస్టర్ అనిపించుకుంది. ఆ తరువాత మరో డైరెక్టర్, హీరో ఈ సాహాసం చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు విశ్వక్‌సేన్ - అనుదీప్ కెవీల కాంబినేషన్‌లో సితార నాగవంశీ సాహసం చేసినా పెద్దగా ఫలించలేదు. కథలేదని, కామెడీ మాత్రమే ఉందని, ఎలాంటి లాజిక్‌లు వెతక్కుండా వచ్చి సినిమా చూడమని ముందే స్టేట్మెంట్‌లిచ్చినా ఉపయోగం లేకుండా పోవడంతో తన తదుపరి ప్రాజెక్ట్‌ల విషయంలో జాగ్రత్తలు పడుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.