• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కాజల్ కు సెకండ్...

కాజల్ కు సెకండ్ ఇన్నింగ్స్ లో అలాంటి రోల్స్ వస్తాయా..?

By - Tupaki Desk
Update: 2022-11-14 08:30 GMT
'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన అందాల భామ కాజల్ అగర్వాల్.. తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకుంది. దాదాపు దశాబ్దానికి పైగా టాలీవుడ్ అగ్ర కథానాయికలలో ఒకరిగా రాణించింది. మూడు పదుల వయసులోనూ యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ.. వరుస సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఓ వైపు కుర్ర హీరోలతో రొమాన్స్ చేస్తూనే.. మరోవైపు సీనియర్ హీరోలకు జోడీగా సందడి చేసింది.

ఈ క్రమంలో రెండేళ్ల క్రితం పాండమిక్ టైములో ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని కాజల్ అగర్వాల్ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినీ కెరీర్ కొనసాగిస్తానని ప్రకటించిన ఈ బ్యూటీ.. పలు క్రేజీ ప్రాజెక్ట్స్ కు సైన్ చేసింది. అందులో కొన్ని సినిమాలను పూర్తి చేసింది. అయితే ప్రెగ్నెన్సీ కంఫర్మ్ అయిన తర్వాత ఆమె సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. 'ది ఘోస్ట్' వంటి కొన్ని చిత్రాలను వదులుకుంది.

ఇక ఈ ఏడాది ఏప్రిల్‌ లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్ కిచ్లు.. అప్పటి నుంచి తన బాబు ఆలనా పాలనా చూసుకుంటూ వచ్చింది. అయితే అందాల చందమామ మళ్ళీ ఇప్పుడు సినిమాల్లోకి తిరిగి రావడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇటీవల పునఃప్రారంభమైన 'ఇండియన్ 2' మూవీ షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ క్రమంలో ఎప్పటిలాగే ఫోటో షూట్స్ చేస్తూ.. నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తోంది.

కాజల్ తిరిగి మేకప్ వేసుకోవడంతో ఆమెకు పలువురు దర్శకనిర్మాతల నుంచి ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. ఇటీవల ఓ దర్శకుడు ఒక లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టుతో కాజల్‌ ను సంప్రదించాడట. అయితే ఆమె దాన్ని సున్నితంగా తిరస్కరించిందట. దీనికి కారణం కాజల్ అలాంటి పాత్రలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. కాజల్ మునుపటిలా గ్లామర్ రోల్స్ చేయాలని ఆశ పడుతోందట.

స్టార్ హీరోల సరసన కమర్షియల్ సినిమాలు చేయాలని కాజల్ కోరుకుంటోందట. అందుకే ప్రస్తుతానికి మహిళా ప్రాధాన్యత చిత్రాలు చేయకూడదని అనుకుంటోందట. అలాంటి పాత్రలు చేయడానికి తనకు ఇంకా చాలా సమయం ఉందని ఆమె భావిస్తోందట. అయితే ఒక బిడ్డకు తల్లైన కాజల్ అగర్వాల్ కు సెకండ్ ఇన్నింగ్స్ లో అలాంటి గ్లామరస్ పాత్రలు వస్తాయా? అనేదే చూడాలి.

ఎందుకంటే గ్లామర్ ఫీల్డ్ లో ఒక్కసారి పెళ్ళైతే హీరోయిన్ గా కెరీర్ ముగిసినట్లే అని భావిస్తుంటారు. ఇక పిల్లలకు జన్మించిన తర్వాత సపోర్టింగ్ రోల్స్ లో తీసుకోడానికే ఫిలిం మేకర్స్ భావిస్తుంటారు. బాలీవుడ్ లో అయితే పెళ్లి - పిల్లలతో సంబంధం లేకుండా హీరోయిన్ ఆఫర్లు వస్తాయి కానీ.. సౌత్ ఇండస్ట్రీలో అలా కాదు. టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్లుగా రాణించిన చాలా మంది.. ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్టుగా చేస్తుండటం మనం చూస్తున్నాం.

ఈ నేపథ్యంలో కాజల్ అగర్వాల్ కు మునుపటిలా గ్లామర్ రోల్స్.. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు వస్తాయా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాకపోతే సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి - నాగార్జున - బాలకృష్ణ - వెంకటేష్ సినిమాలలో నటించే అవకాశాలు రావొచ్చని మరికొందరు అంటున్నారు. ఇప్పటికైతే కాజల్ చేతిలో 'ఇండియన్ 2' మూవీ ఒక్కటే ఉంది. మరి రాబోయే రోజుల్లో కొత్త ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తుందేమో చూడాలి.

ఇకపోతే 'ఆచార్య' సినిమాలో తన పాత్రను తొలగించిన తర్వాత.. కాజల్ చివరగా 'హే సినామిక' అనే చిత్రంలో కనిపించింది. అలానే 'కరుంగాపియం' 'ఘోస్టీ' వంటి రెండు తమిళ్ సినిమాలు మరియు 'ఉమ' అనే హిందీ చిత్రం షూటింగ్ పూర్తి చేసింది. ఇవి మూడు విడుదల కావాల్సి ఉంది. గతేడాది 'లైవ్ టెలికాస్ట్' అనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వెబ్ సిరీస్ తో కాజల్ ఓటీటీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • KajalAggarwal 
  • Tollywood 
  • StarActress 
  • LaxmiKalyanam 
  • Gautham 
  • Cinemacarrer 
  • TheGhost 
  • Indian2 
  • Nagarjuna 
  • BalaKrishna 
  • Venkatesh 
  • Movienews 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS