• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాగార్జున గారూ.. ఈ డబ్బా...

నాగార్జున గారూ.. ఈ డబ్బా ఏంటండీ?

By - Tupaki Desk
Update: 2019-07-19 06:24 GMT
ఎంత మెయింటైన్ చేసినా.. ఫిట్నెస్ మీద ఎంత దృష్టి ఉన్నా.. ఒక వయసు దాటాక లుక్ మెయింటైన్ చేయడం కష్టం. ఇందుకు ఎవ్వరూ మినహాయింపు కాదు. ఒక వయసు వచ్చాక వాస్తవాన్ని అంగీకరించి ఒరిజినల్ లుక్‌ ను చూపించడానికి ప్రయత్నించాలి. సినిమా కోసం మేకప్ వేసుకుని మెయింటైన్ చేస్తే చేయొచ్చు కానీ.. అదే ఒరిజినల్ అన్నట్లుగా కవర్ చేయడానికి ప్రయత్నిస్తేనే జనాల దృష్టిలో తక్కువ కావాల్సి ఉంటుంది.

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ఇప్పుడు అదే చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఆయన ఫిట్నెస్ ఫ్రీక్ అన్న సంగతి తెలిసిందే. తెలుగులో మిగతా సీనియర్ హీరోలతో పోలిస్తే ఫిజిక్, లుక్ పరంగా నాగార్జునే ముందు వరసలో నిలుస్తాడు. ఐతే బాడీ అయితే మెయింటైన్ చేస్తున్నాడు కానీ.. నాగ్ ముఖంలో మాత్రం మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

నాగ్ ఫేస్‌ లో మునుపటి గ్లో కనిపించడం లేదు. ముఖంపైకి ముడతలు కూడా వచ్చాయి. ఐతే ఇప్పుడు ‘మన్మథుడు-2’ చేస్తున్న ఆయన.. వయసు ప్రభావం కనిపించకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కెరీర్లో ఎన్నడూ లేనంత మేకప్ వేసుకుంటున్నాడు. ఆ విషయం పోస్టర్లు చూస్తే స్పష్టంగా తెలిసిపోతోంది. మేకప్ చాలదన్నట్లు.. ఫొటో షాప్ ఎడిట్లు కూడా చేసి మరీ పోస్టర్లు వదులుతున్నారు. నాగ్ ముఖానికి నునుపు కూడా తెస్తున్నారు. మరి ఇంత ప్రయత్నం చేశాక.. ఇదంతా ఒరిజినల్ అన్నట్లు కలరింగ్ ఇవ్వడమే విడ్డూరం.

తాజాగా ఫేస్ యాప్‌ లో హీరోలు లేటు వయసులో ఎలా ఉంటారో చూపించే ట్రెండ్ ఒకటి నడుస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ‘మన్మథుడు’ టీం వాళ్లు దీన్ని కూడా ప్రమోషన్ కోసం వాడేస్తున్నారు. ఫేస్ యాప్‌ లో ‘మన్మథుడు’ నాటి నాగ్ ఫొటో పెట్టి ఇప్పటి రోజులకు ఎలా ఉంటాడో పిక్ తీశారు. దీన్ని ప్రస్తుతం ‘మన్మథుడు’ లుక్‌తో పోల్చి.. చూశారా నాగ్ ఇంకా ఎంత మెయింటైన్ చేస్తున్నాడో అని గొప్పలు పోతున్నారు. కానీ మేకప్, ఫొటో షాప్ ఏదీ చేయకుండా ఫొటో పెట్టి పోల్చి చూస్తే అప్పుడు తెలిసేది నాగ్ మెయింటైనెన్స్ ఎలాంటిదని.
 
    
    
    

Tags:    
  • Hero Nagarjuna 
  • Manmadhudu 2 Movie 
  • Latest News 

Similar News

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS