'దేవీ'కైనా బన్నీ రెస్పాండ్ అవుతాడా...?
ప్రస్తుతం టాలీవుడ్ లో ‘బీ ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ట్రెండింగ్ లో ఉంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్టార్ట్ చేసిన ఈ ఛాలెంజ్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల వరకూ వెళ్ళింది. ఉత్తమ పురుషులెవరూ ఇంట్లోని మహిళలతో ఇలాంటి క్వారంటైన్ టైమ్ లో పనిచేయించరంటూ ‘బీ ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. మొదట సందీప్ రెడ్డి వంగా ఈ ఛాలెంజ్ ను దర్శకుడు రాజమౌళి కి విసరగా.. రాజమౌళి ఛాలెంజ్ ను స్వీకరించి తన ఇంటిని శుభ్రం చేసి ఆ ఛాలెంజ్ ను కాస్తా ఎన్టీఆర్ - రామ్ చరణ్‌లకు, కీరవాణి, సుకుమార్, శోభు యార్లగడ్డలకు విసిరిన విషయం తెలిసిందే. ఈ ఛాలెంజ్ ని పూర్తి చేసిన లెక్కల మాస్టర్ సుకుమార్ ఈ సవాలుని స్వీకరించవలసిందిగా మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ని నామినేట్ చేసాడు. ఇప్పుడు తాజాగా దేవిశ్రీ కూడా సుక్కు విసిరిన ఛాలెంజ్‌ను పూర్తి చేశాడు.
ఇంటిని శుభ్రం చేశాడు.. అలాగే కిచెన్ లోకి వెళ్లి ఆమ్లెట్ వేసి తల్లికి తినిపించాడు. తర్వాత ఆ ప్లేట్ కడిగేసాడు. తన తండ్రి ఫోటోను తుడిచి అమ్మ దగ్గరకి వెళ్లి కౌగిలించుకున్నాడు. ఆ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. తన అల్లుడు నిద్రలేపి ‘బీ ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ కంప్లీట్ చేసిన వారి వీడియోలను చూపించగా.. సరే అంటూ మళ్ళీ నిద్రపోవాలని ట్రై చేసిన దేవిని.. 'దేవీ మామ సుక్కు మామ వెయిటింగ్' అంటూ అల్లుడు నిద్రలేపి సుకుమార్ ఈ ఛాలెంజ్ కి దేవిని నామినేట్ చేసినట్లు ఫన్నీగా ఈ వీడియో ఎడిట్ చేసారు. రియల్ మ్యాన్ లను తయారు చేసిన 'అమ్మ'లందరికీ ఈ వీడియో అంకితం అంటూ ఛాలెంజ్ ఎండ్ చేసాడు.
అనంతరం ఇలాంటి ఎంటర్టైనింగ్ ఎఫర్ట్స్ పెట్టిన సందీప్ వంగా, రాజమౌళి, చిరంజీవి లను ట్యాగ్ చేస్తూ ఈ ఛాలెంజ్ ను కొనసాగించాల్సిందిగా అల్లు అర్జున్, తమిళ హీరో కార్తీ, కన్నడ హీరో యశ్, దర్శకుడు హరీష్ శంకర్, దిగ్గజ నటుడు మోహన్‌లాల్ లను నామినేట్ చేశాడు. ఇప్పటికే అల్లు అర్జున్ ని 'బాహుబలి' ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ నామినేట్ చేసాడు. కానీ బన్నీ నుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పటి దాకా సిల్వర్ స్క్రీన్ మీద తమ అభిమాన హీరో పనులు చేయడం చూసిన బన్నీ ఫ్యాన్స్ ఇప్పుడు ఇంట్లో పనులు చేస్తే చూడాలని ఆశపడుతున్నారు. మరి బన్నీ ఇప్పుడు దేవీశ్రీ ఛాలెంజ్ నైనా స్వీకరించి 'రియల్ మ్యాన్' అనిపించుకుంటాడేమో చూడాలి.

Here’s my #betheREALMAN video Dear SUKU BHAI @aryasukku