శ్రద్ధను రిజెక్ట్ చేశారు..అలియాను యాక్సెప్ట్ చేస్తారా?

Update: 2020-03-15 10:24 GMT
అదేంటో గానీ సౌత్ హీరోయిన్లకంటే మన ఫిలిం మేకర్లు బాలీవుడ్ హీరోయిన్లకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. టాలీవుడ్ లో ఉండేవారిలో ఎక్కువమంది నార్త్ భామలే అయినప్పటికీ వారు సౌత్ హీరోయిన్ల కిందే పరిగణిస్తారు. ఈ హీరోయిన్లకు మన దర్శకనిర్మాతలు ఇచ్చే ప్రాధాన్యత వేరు.. పారితోషికం వేరు. అదే బాలీవుడ్ నుంచి తీసుకొచ్చిన హీరోయిన్లకు ఇచ్చే గౌరవం.. పారితోషికం అంతా డబల్.. ట్రిపుల్ గా ఉంటుందని టాక్ ఉంది.

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న క్రేజీ ప్రాజెక్టు 'RRR' లో బాలీవుడ్  హీరోయిన్ అలియా భట్ నటిస్తోంది.  అలియాతో పూర్తి స్థాయిలో షూటింగ్ షెడ్యూల్స్ ఇంకా మొదలు పెట్టలేదు కానీ ఇప్పటి నుంచే అలియా ఓ అద్భుత నటి అంటూ సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరికీ చెప్తున్నారట.  'సాహో' షూటింగ్ సమయంలో కూడా ఇలాగే శ్రద్ధా కపూర్ గురించే ఇలాగే హైప్ ఇచ్చారు కానీ శ్రద్ధా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. శ్రద్ధా లుక్స్ తేడాగా ఉన్నాయని కూడా కామెంట్లు కూడా వినిపించాయి.  భారీ స్థాయిలో పారితోషికం ఇచ్చినప్పటికీ ఇలాంటి ఫీడ్ బ్యాక్ రావడం ఇతర ఫిలిం మేకర్లకు ఒక పాఠంగా కూడా మారింది.

అంతే కాకుండా భారీ పారితోషికం చెల్లించి మరీ తీసుకొచ్చి నటింపజేసిన సినిమాల్లో అధిక శాతం ఫెయిల్యూర్లుగా నిలిచాయి. మరి RRR విషయంలో ఏం జరుగుతుందో.. అలియాకు రిలీజ్ తర్వాత ఎలాంటి స్పందన దక్కుతుందో వేచి చూడాలి.


Tags:    

Similar News