అవతార్ 2 బ్లాస్ట్ అయ్యాక 3,4,5 కి ఇంత ఉత్సాహం ఉంటుందా..?

Update: 2023-01-05 23:30 GMT
తను తీసే సినిమా లేట్ అవ్వచ్చు కానీ ప్రేక్షకులకు ఒక మంచి సినిమాటిక్ విజువల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు.. అద్భుతమైన విజువల్ వండర్ ని క్రియేట్ చేసేందుకు చాలా కష్టపడతాడు అకాడమి విన్నర్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్. టైటానిక్ తోనే తన సినిమాటిక్ వరల్డ్ లో సినీ ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేసి వారెవా అనిపించిన ఆయన అవతార్ సీరీస్ లతో మరింత పిచ్చెక్కిస్తున్నాడు. అవతార్ 1 సినిమా 2009లో వచ్చి వరల్డ్ సినీ లవర్స్ ని షేక్ చేసింది.

ఇక 13 ఏళ్ల తర్వాత అవతార్ 2 రిలీజైంది. అవతార్ 1ని మించిన విజువల్ ఎక్స్ పీరియన్స్ తో జేమ్స్ కామెరాన్ మరోసారి తన ప్రతిభ చాటారు. అవతార్ 1 కన్నా అవతార్ 2 అన్ని విధాలుగా బెస్ట్ అనిపించుకుంది. అయితే అవతార్ 2 చూసిన కొందరు అవతార్ 1 తో పోల్చుతూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కానీ జేమ్స్ కామెరాన్ లెక్క ఎప్పుడూ తప్పదు. అవతార్ 2 కూడా బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన వసూళ్లను రాబడుతోంది. టార్గెట్ పెద్దగా అయ్యే సరికి కొద్దిగా టైం తీసుకుంటుంది కానీ అవతార్ 2 కూడా జేమ్స్ కామెరాన్ స్టామినా ప్రూవ్ చేసింది.
Read more!

అవతార్ 2 తో పాటుగా అవతార్ 3, 4, 5 లకు సంబంధించిన పనులు కూడా మొదలు పెట్టాడు జేమ్స్ కామెరాన్. అవతార్ 2 టైం లోనే అవతార్ 3 ని కొంత షూట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా అవతార్ 3, 4, 5 సినిమాల రిలీజ్ డేట్ లు బయటకు వచ్చాయి. అవతార్ 3 ని డిసెంబర్ 20, 2024 లో రిలీజ్ ప్లాన్ చేశారు. డిసెంబర్ 18, 2026 న అవతార్ 4 రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక అవతార్ 5 ని కూడా 2028 డిసెంబర్ 22న రిలీజ్ ఫిక్స్ చేశారు. వీటికి సంబంధించిన వర్క్ ఇప్పటికే మొదలు పెట్టినట్లు తెలుస్తుంది.

అవతార్ 2 హిట్ కాకపోతే అవతార్ 3 తోనే ఈ సీరీస్ ఆపేస్తానని గతంలో జేమ్స్ కామెరాన్ అన్నారు. కానీ అవతార్ 2 ని కూడా ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారు. ముఖ్యంగా వరల్డ్ సినిమాలో హ్యూమన్ ఎమోషన్స్ మీద జేమ్స్ కామెరాన్ చూపించిన తీరు ప్రశంసలు దక్కించుకుంది.

సో కచ్చితంగా అవతార్ 3 తో పాటుగా 4,5 కూడా ఉండే ఛాన్స్ ఉంది. వాటి రిలీజ్ డేట్ లు కూడా లాక్ చేసి ఆ టార్గెట్ తో పనిచేస్తున్నారు ఆ చిత్ర యూనిట్. అవతార్ 1 కి 2 కి మధ్య 13 ఏళ్లు గ్యాప్ తీసుకున్న జేమ్స్ కామెరాన్ తర్వాత రాబోతున్న భాగాలకు మాత్రం పెద్దగా టైం తీసుకోవట్లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News