బిబి4 : స్వాతి దీక్షిత్ కు అతడి పరిస్థితే
బిగ్ బాస్ నాల్గవ వారం ఎలిమినేషన్ కు ఏడుగురు నామినేట్ అయ్యారు. వారు స్వాతి దీక్షిత్.. అభిజిత్.. లాస్య.. హారిక.. సోహెల్.. మెహబూబ్.. కుమార్ సాయి. ఈసారి వీక్ కంటెస్టెంట్ గా మెహబూబ్ మరియ కుమార్ సాయి చివరగా స్వాతి దీక్షిత్ అనుకుంటున్నారు. స్వాతి దీక్షిత్ వచ్చి కనీసం రెండు రోజులు కాకుండానే ఆమెను నామినేషన్ లో ఉంచడం కరెక్ట్ కాదు. ఆమెను ఈ వారం ఎలిమినేషన్ పక్రియ నుండి తప్పించి ఉంటే బాగుండేది. సరే ఆమె నామినేషన్ పక్రియలో ఉన్నా ఇంటి సభ్యులు ఆమెను కొన్ని రోజులు కూడా అర్థం చేసుకోకుండా నామినేట్ ఎలా చేస్తారు. అమ్మ రాజశేఖర్ సిల్లీ రీజన్ చెప్పి ఆమెను నామినేట్ చేయడం జరిగింది.
కొత్తగా వచ్చింది.. అందరితో కలవాలని నామినేట్ చేస్తున్నాను అనడం చాలా సిల్లీగా అనిపించింది. వెళ్లిన రెండు రోజులకే నామినేట్ అవ్వడం అంటే ఎవరికి అయినా కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఆ ఇబ్బందితో ఆమె గేమ్ సరిగా ఆడలేక పోవచ్చు. మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కుమార్ సాయి విషయంలో అదే జరిగింది. ఆయన రావడం రావడంతోనే ఎలిమినేషన్ కు నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా కొత్తగా వచ్చాడు.. ఎవరితో కలవడం లేదు అంటూ నామినేట్ చేశారు. అతడికి వచ్చిన వెంటనే నామినేషన్ వల్ల ఇతరులతో కలవడానికి ఇబ్బంది పడుతున్నాడు.
ఇప్పుడు అదే పరిస్థితి స్వాతికి కూడా వర్తిస్తుంది. ఆమె తాను మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యాను. ఈ వారం సేవ్ అవుతానా లేదా అనే భయంతో ఆమె ఇంటి సభ్యులతో ఫ్రీగా ఉండలేదు. అలా ఉండగానే వీకెండ్ వచ్చేస్తుంది. అక్కడ ఆమె సేవ్ అయినా సోమవారం ఆమె ఎవరితో కలవలేదు. ఆమె కలిసేందుకు ప్రయత్నించడం లేదు అంటూ మళ్లీ నామినేట్ చేసే అవకాశం ఉంది. కుమార్ సాయి విషయంలో ఇదే జరిగింది. వాళ్లు కలిసేందుకు టైం కూడా ఇవ్వకుండా నామినేట్ చేస్తుండటం వల్ల వారు మానసికంగా మరింత తోటి కంటెస్టెంట్స్ కు దూరం అయ్యే అవకాశం ఉంది. అందుకే ఒక్క వారం అయినా వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ఎలిమినేషన్ నుండి ఉపశమనం కలిగిస్తే బాగుండేది.