మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్‌స్టోరీనే న‌మ్ముకున్న లెజెండ్‌!

మ‌ణిర‌త్నం తెర‌కెక్కించ‌నున్న లేటెస్ట్ మూవీ కోసం విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి, సాయి ప‌ల్ల‌వి తొలిసారి జంట‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.;

Update: 2026-04-11 11:30 GMT

ప‌దేళ్ల క్రితం వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మైన లెజెండ‌రీ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం 2015లో దుల్క‌ర్ స‌ల్మాన్‌, నిత్యామీన‌న్ జంట‌గా రొమాంటిక్ ల‌వ్‌స్టోరీని రూపొందించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమాతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చేసిన మ‌ణిర‌త్నం ఆ త‌రువాత కూడా అదే ఊపుని కొన‌సాగిస్తూ వ‌చ్చారు. అయితే ఆ త‌రువాత కార్తీతో చేసిన `కాట్రు వెలియిడై` బాక్సాఫీస్ వ‌ద్ద భారీ ఫ్లాప్‌గా నిలిచి షాక్ ఇచ్చింది. అయితే డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియిన్ సెల్వన్‌` రెండు భాగాలుగా విడుద‌లై మంచి విజ‌యాల్ని సొంతం చేసుకున్నాయి.

అయితే తెలుగు, హిందీ భాష‌ల్లో మాత్రం ప్ర‌భావం చూపించ‌లేక‌పోయాయి. ఆ త‌రువాత సుధీర్ఘ విరామం అనంత‌రం క‌మ‌ల్‌తో చేసిన `థ‌గ్ లైఫ్‌` మ‌ణిర‌త్నంకు బిగ్ షాక్ ఇచ్చి ఆయ‌న కెరీర్‌ని ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డేసింది. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. దీంతో ఆలోచ‌న‌లోప‌డిన మ‌ణిర‌త్నం త‌న‌కు క‌లిసొచ్చిన జాన‌ర్‌ని న‌మ్ముకుంటూ రొమాంటిక్ ల‌వ్‌స్టోరీతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి రావాల‌నే ప్లాన్ చేస్తున్నారు. ఇందు కోసం రేర్ కాంబినేష‌న్‌ని సెట్ చేసుకున్నారు.

మ‌ణిర‌త్నం తెర‌కెక్కించ‌నున్న లేటెస్ట్ మూవీ కోసం విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి, సాయి ప‌ల్ల‌వి తొలిసారి జంట‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. మ‌ద్రాస్ టాకీస్‌పై లైకా ప్రొడ‌క్ష‌న్స్‌తో క‌లిసి మ‌ణిర‌త్నం స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. గ‌త కొన్ని రోజులుగా వార్త‌ల్లో నిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎట్ట‌కేల‌కు మే 14న లాంచ‌నంగా ప్రారంభంకాబోతోంది. ఆ రోజు నుంచే రెగ్యుల‌ర్ షూటింగ్ ని మొద‌లు పెట్ట‌బోతున్నారు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

ఇంకా టైటిల్ ఖ‌రారు కానీ ఈ మూవీకి సంబంధించిన ప్రోమోని ఈ నెల‌లోనూ షూట్ చేయ‌బోతున్నారు. ఈ ప్రోమోతో అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ని మేక‌ర్స్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, మ‌ద్రాస్ టాకీస్ అధికారికంగా ప్ర‌కటించ‌నున్నాయి. వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్‌ల‌లో న‌టిస్తూ బిజీగా ఉన్నా సాయి ప‌ల్ల‌వి ఈ మూవీని ఏరి కోరి చేస్తోంది. విజ‌య్ సేతుప‌తికి మ‌ణిర‌త్నం డైరెక్ష‌న్‌లో ఇది రెండ‌వ సినిమా. ఇంత‌కు ముందు `చెక్క‌చివంత వానం`లో న‌టించాడు.

ఇదిలా ఉంటే సాయి ప‌ల్ల‌వి న‌టిస్తున్న `రామాయ‌ణ‌` పార్ట్ 1 ఈ దీపావ‌ళికి భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇక త‌ను న‌టించిన ఫ‌స్ట్ హిందీ ఫిల్మ్ `ఏక్ దిన్‌` మే 1న రిలీజ్ కానుంది. ఇక విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్న `స్ల‌మ్ డాగ్` షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది. ట‌బుతో పాటు సంయుక్త మీన‌న్ ఇందులో న‌టిస్తున్నారు.

Tags:    

Similar News