ఒక్క మూవీ దెబ్బ‌తో రైట‌ర్‌గా మారిన‌ డైరెక్ట‌ర్‌!

ఇప్పుడు ఓ డైరెక్ట‌ర్ విష‌యంలో ఇదే అక్ష‌ర స‌త్యంగా మారుతోందా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.;

Update: 2026-04-11 15:30 GMT

సినిమా ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ మాత్ర‌మే మాట్లాడుతుంద‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. స‌క్సెస్ లేక‌పోతే ఇక్క‌డి ప‌ట్టించుకునే నాథుడే వుంద‌ర‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. స‌క్సెస్ ఉన్న‌ప్పుడే ఇక్క‌డ ఎవ‌రికైనా విలువ‌. అది లేక‌పోతే పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోరు. మ‌ళ్లీ మ‌న గురించి ఇండ‌స్ట్రీ మాట్లాడాల‌న్నా..మ‌న టైమ్ మారాల‌న్నా మ‌ళ్లీ స‌క్సెస్ లోకి రావాల్సిందే. ఇందు కోసం మ‌రో ప‌ద్ద‌తిని ఎంచుకోవాల్సిదే. ఇప్పుడు ఓ డైరెక్ట‌ర్ విష‌యంలో ఇదే అక్ష‌ర స‌త్యంగా మారుతోందా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.

`జాతిర‌త్నాలు` సినిమాతో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు అనుదీప్ కెవి. కేవ‌లం ఆరు కోట్ల బ‌డ్జెట్‌తో న‌వీన్ పొలిశెట్టి, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఫ‌రియా అబ్దుల్లాని హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేస్తూ రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద అనూహ్యంగా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌నే కాకుండా మేక‌ర్స్‌ని సైతం విస్మ‌యానికి గురి చేసింది. ఏకంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.70 కోట్లు క‌లెక్ట్ చేయ‌డంతో అంతా అవాక్క‌య్యారు.

ఇంత‌టి విజ‌యం త‌రువాత భారీ క్రేజ్‌ని సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడ అనుదీప్ కెవీ మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఆ త‌రువాత శివ‌కార్తికేయ‌న్‌తో చేసిన బైలింగ్వ‌ల్ ఫిల్మ్ `ప్రిన్స్‌` ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. `జాతిర‌త్నాలు

` క్రేజ్‌ని, స‌క్సెస్‌ని కంటిన్యూ చేయ‌లేక‌పోయింది. దీంతో కొంత ఆలోచ‌న‌లో ప‌డిన అనుదీప్ త‌న‌దైన మార్కు కామెడీతో విశ్వ‌క్‌సేన్ హీరోగా చేసిన మూవీ `ఫంకీ`. క‌యాదు లోహ‌ర్ క‌థ‌నాయ‌క‌. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన ఈ సినిమా తీవ్ర స్థాయిలో నిరాశ‌కు గురి చేసింది.

విశ్వ‌క్‌సేన్‌, అనుదీప్ కాంబినేష‌న్ అనగానే అంతా భారీ స్థాయిలో ఊహించుకున్నారు. కానీ ఆ ఊహ‌ల‌ని ఫుల్ ఫిల్ చేయ‌లేక బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా బోల్తాకొట్టేసి షాక్ ఇచ్చింది. ఫ‌లితం డైరెక్ట‌ర్‌కు పెద్ద స్టార్ సినిమా మిస్స‌యింది. ఇప్పుడు ఓ డైరెక్ట‌ర్ సినిమాకు త‌ను రైట‌ర్‌గా ప‌ని చేసేలా చేసింది. `తొలిప్రేమ‌` వంటి క‌ల్ట్ క్లాసిక్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ ల‌వ్‌స్టోరీని అందించి గ‌త కొంత కాలంగా వ‌రుస ఫ్లాపుల‌తో రేసులో వెన‌క‌బ‌డిపోయిన ఏ.క‌రుణాక‌ర‌ణ్ ఇప్పుడు ఓ ల‌వ్ స్టోరీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.

బెల్లంకొండ శ్రీ‌నివాస్ సోద‌రుడు బెల్లంకొండ గ‌ణేష్ క‌థానాయ‌కుడిగా ఈ మూవీలో న‌టించ‌నున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్త‌యింది. ఏప్రిల్ 15న లాంఛ‌నంగా ముహూర్తంతో సినిమాని ప్రారంభించ‌బోతున్నారు. ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు అనుదీప్ కెవి డైలాగ్స్ రాస్తున్నారు. బిగ్ స్టార్‌తో సినిమా చేయాల‌ని ప్లాన్ చేస్తున్న అనుదీప్ `ఫంకీ` దెబ్బ‌తో ఇప్ప‌డు రైట‌ర్‌గా మారి క‌రుణాక‌ర‌న్‌, బెల్లంకొండ గ‌ణేష్ సినిమాకు డైలాగ్ రైట‌ర్‌గా మార‌డంతో అంతా షాక్ అవుతున్నారు.

Tags:    

Similar News