ట్రెండీ టాక్: అర్థ నగ్న వీడియోలతో నటీమణులకు లక్షల్లో ఆదాయం
మొత్తానికి.. చెమట పట్టకుండా లక్షల్లో సంపాదించాలనే తాపత్రయం.. సమాజంలోని కట్టుబాట్లను.. చట్టాలను తుంగలో తొక్కేలా చేస్తోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.;
నేటి సోషల్ మీడియా యుగంలో పాపులారిటీని సంపాదించుకోవడం ఎంత సులభమో.. దానిని ఆదాయ వనరుగా మార్చుకోవడం కూడా అంతే వేగంగా మారుతోంది. ముఖ్యంగా టీవీ సీరియళ్లు, రియాలిటీ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కొందరు నటీమణులు- యాంకర్లు ఇప్పుడు తమ గ్లామర్‌ను పెట్టుబడిగా పెట్టి `మెంబర్‌షిప్` పేరుతో లక్షల్లో ఆర్జిస్తున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికలపై ప్రత్యేక మెంబర్‌షిప్‌లు ఆఫర్ చేస్తూ.. అర్థనగ్నంగా ఉండే వీడియోలను కేవలం డబ్బు చెల్లించిన వారికే చూపిస్తున్నారు. కేవలం రూ. 99 నుండి రూ. 399 వరకు వివిధ ఆఫర్లను ప్రకటిస్తూ.. లక్షలాది మంది ఫాలోవర్లను ఈ పెయిడ్ కంటెంట్ వైపు మళ్లిస్తున్నారు.
ఈ తరహా ఆదాయ మార్గం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ప్లాట్‌లోని గదిలోనే కెమెరా పట్టుకునే ఒక సహాయకుడు ఉంటే చాలు.. దాదాపు పూర్తి నగ్నంగా లేదా అర్థనగ్నంగా ఉండే వీడియోలను చిత్రీకరించి ఈ ఛానెళ్లలో అప్‌లోడ్ చేస్తున్నారు.`మీరు రెడీనా?` అంటూ యువతను ఊరిస్తూ మెంబర్‌షిప్‌లు తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ వీడియోలు షేర్ చేయడానికి వీలు లేకుండా.. కేవలం మెంబర్‌షిప్ ఉన్నవారే చూసేలా పరిమితులు విధిస్తుండటంతో ప్రతి ఒక్కరూ డబ్బు చెల్లించక తప్పని పరిస్థితిని కల్పిస్తున్నారు. దీనివల్ల సదరు నటీమణులకు నెలవారీగా రూ. 7 నుండి 8 లక్షల వరకు ఎటువంటి శ్రమ లేకుండానే ఆదాయం వచ్చి పడుతోంది.
ఈ ధోరణిపై విమర్శలు వస్తున్నప్పుడు.. కొందరు నటీమణులు తమ చర్యలను సమర్థించుకోవడం గమనార్హం. ``ఎవరు చూడమన్నారు? ఇష్టం ఉన్నవారే డబ్బు కట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటున్నారు కదా!`` అని వారు ఎదురు ప్రశ్నిస్తున్నారు. సినిమాల్లో టికెట్ కొని చూసినట్లే.. ఇక్కడ కూడా డబ్బు కట్టిన వారు చూసుకుంటారు. మధ్యలో ఇతరులకెందుకు అనే వాదనను వారు వినిపిస్తున్నారు. కొన్ని సున్నితమైన కేసులలో బాధితులు లేదా నిందితుల వైఖరిని ఉదాహరణగా చూపిస్తూ.. డబ్బు చెల్లించిన వారి ప్రైవసీని తాము గౌరవిస్తున్నామని.. ఇది తమ వ్యక్తిగత వృత్తి అని వారు వాదిస్తున్నారు.
అయితే భారతీయ సమాజం .. చట్టాల ప్రకారం ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో బహిరంగంగా ``బట్టలు విప్పుతాను.. డబ్బు కట్టు!`` అని అడగడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారతీయ చట్టాల ప్రకారం అశ్లీలతను వ్యాప్తి చేయడం లేదా అశ్లీల కంటెంట్ ద్వారా ఆదాయం పొందడం వంటి అంశాలు చట్టవిరుద్ధమైన పనులుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ``నా డబ్బు నేను బెట్టింగ్ యాప్‌లలో పెడుతున్నాను.. పోలీసులకెందుకు?`` అని అడగడం ఎలాగైతే నేరమో... చట్టం అనుమతించని పనులను చేస్తూ ఇతరుల ప్రమేయం ఉండకూడదని అనడం కూడా చట్టపరంగా చెల్లదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మొత్తానికి.. చెమట పట్టకుండా లక్షల్లో సంపాదించాలనే తాపత్రయం.. సమాజంలోని కట్టుబాట్లను.. చట్టాలను తుంగలో తొక్కేలా చేస్తోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. గ్లామర్ ప్రపంచంలో ఉండే పోటీ .. విలాసవంతమైన జీవితం కోసం కొందరు నటీమణులు ఎంచుకుంటున్న ఈ అడ్డదారులు భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి. సోషల్ మీడియాలో కంటెంట్ నియంత్రణపై కఠినమైన నిబంధనలు లేకపోవడం కూడా ఇటువంటి కార్యకలాపాలకు ఊతమిస్తోంది.