• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సుధీర్ వర్మ ఆ సినిమాని...

సుధీర్ వర్మ ఆ సినిమాని లైట్ తీసుకున్నాడా..??

By - Tupaki Desk
Update: 2022-09-07 03:30 GMT
'స్వామిరారా' ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ''శాకినీ ఢాకినీ''. ఇందులో అందాల భామలు రెజీనా కాసాండ్రా - నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 'మిడ్ నైట్ రన్నర్స్' అనే సౌత్ కొరియన్ యాక్షన్ కామెడీ చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్.

సురేష్ ప్రొడక్షన్స్ - గురు ఫిల్మ్స్ మరియు క్రాస్ పిక్చర్స్ సంస్థలు కలిసి 'శాకినీ ఢాకినీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దగ్గుబాటి సురేష్ బాబు - సునీత తాటి - హ్యూన్వూ థామస్ కిమ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గతంలో వీరు కలిసి నిర్మించిన 'ఓ బేబీ' చిత్రం సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

'శాకిని డాకిని' సినిమా ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇటీవలే టీజర్ మరియు ఫస్ట్ సింగిల్ ను లాంచ్ చేశారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో దర్శకుడు సుదీర్ వర్మ ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

సుధీర్ వర్మ ఈ సినిమా గురించి ఇటీవల కాలంలో ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు. ప్రస్తుతం తాను డైరెక్ట్ చేస్తున్న 'రావణాసుర' సినిమా పనులు చూసుకుంటున్నారు తప్ప.. 'శాకిని డాకిని' ప్రచారాన్ని పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ సినిమా నుంచి దర్శకుడు దూరంగా ఉండటం వెనుక ఒక బలమైన కారణం వుందని అంటున్నారు. నిర్మాతల్లో ఒకరైన సునీత తాటి మేకింగ్ విషయంలో ఎక్కువగా ఇన్వాల్ అయ్యారని.. కొరియన్ స్క్రిప్ట్ ని యధాతధంగా తీయాలని పట్టుబట్టారని ఇన్ సైడ్ టాక్.

కెరీర్ లో తొలిసారిగా రీమేక్ చిత్రాన్ని హ్యాండిల్ చేస్తున్న దర్శకుడు సుదీర్ వర్మ.. ఈ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసారట. దీనికి అంగీకరించని నిర్మాత.. కొరియన్ స్క్రిప్ట్ ప్రకారమే చిత్రీకరణ చేయించారట. దీనికి ఈసారి సుధీర్ వర్మ అంగీకరించలేదట.

ఈలోగా మాస్ మహరాజ్ రవితేజ హీరోగా 'రావణాసుర' సినిమాతో బిజీ అయిపోయారు సుధీర్ వర్మ. అదే సమయంలో నిర్మాత సునీత మాత్రం మరో దర్శకుడితో 'శాకిని డాకిని' లోని కొన్ని సీన్స్ ని రీ షూట్ చేయించారట. తన అంగీకారం లేకుండా మరో డైరెక్టర్ తో షూటింగ్ కు వెళ్ళడంతో సుధీర్ వర్మ ఫీల్ అయ్యారట. అందుకే ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ ను లైట్ తీసుకున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి.

సాధారణంగా సురేష్ బాబు తన సినిమాల ప్రమోషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. నటీనటులు సాంకేతిక నిపుణులు అందరూ ప్రచారంలో భాగమయ్యేలా చూసుకుంటారు. కానీ ఇప్పుడు సుధీర్ వర్మ ప్రమోషన్స్ లో కనిపించడం లేదు. మరి దర్శకుడికి నచ్చజెప్పి ప్రీరిలీజ్ ఈవెంట్ కైనా తీసుకొస్తారేమో చూడాలి.

ఇకపోతే సుధీర్ వర్మ కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన కథలను తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాకపోతే ఇటీవల కాలంలో సరైన కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయాడు. ఇప్పుడు 'రావణాసుర' సినిమాతో ఆ లోటు తీరుతుందని భావిస్తున్నారు.

అభిషేక్ పిక్చర్స్ మరియు ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ - స్క్రీన్‌ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌ తో ఆసక్తికరమైన కథనంలో ఊహించని ట్విస్టులతో ఈ యాక్షన్ థ్రిల్లర్‌ ను తెరకెక్కిస్తున్నారు.

రవితేజను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించనున్నారు. ఇందులో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్ - మేఘా ఆకాష్ - ఫరియా అబ్దుల్లా - దక్షా నగర్కర్ - పూజిత పొన్నాడ వంటి ఐదుగురు హీరోయిన్లు భాగమవుతున్నారు. రిలీజ్ కు రెడీ అవుతోన్న 'రావణాసుర' సినిమా సుధీర్ వర్మ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • TollywoodFilm 
  • SudheerVarma 
  • SwamyRaRaFilm 
  • ShakiniDakiniMovie 
  • Regina 
  • NivethaThomas 
  • FilmIndustry 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS