రాజమౌళి మనసులో ఉంది అదేనా

Update: 2019-01-22 06:10 GMT
టాలీవుడ్ క్రేజీ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ రెండో షెడ్యూల్ కూడా మొదలైపోయింది. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబోలో సన్నివేశాలు చకచకా తెరకెక్కుతున్నాయి. సంక్రాంతితో పాటు కార్తికేయ పెళ్లి కోసం కాస్త గ్యాప్ రావడంతో ఈ సారి ఎక్కువ రోజులు షూటింగ్ జరగనున్నట్టు సమాచారం. అంతా బాగానే ఉంది కానీ ఇప్పటిదాకా ఆర్ ఆర్ ఆర్ లో నటించబోయే హీరోయిన్ల గురించి ఎలాంటి సమాచారం లేదు.

రాజమౌళి ఆల్రెడీ ఫిక్స్ అయ్యాడని మంచి టైం చూసుకుని ప్రకటిస్తాడని కొందరు అంటుండగా తాను కోరుకున్న హీరోయిన్ల కాల్స్ షీట్స్ కన్ఫర్మ్ అయితే కానీ బయటికి చెప్పకూడదని నిర్ణయించుకోవడం వల్ల ఆలస్యం జరుగుతోందని మరో వర్గం అంటోంది. కారణం ఏదైనా రాజమౌళి సినిమాల్లో ఇంత ఆలస్యంగా కథానాయికలు సెట్ కావడం ఇదే మొదటిసారి. అసలు ఇలాంటి సినిమాలో ఆఫర్ రావాలె కానీ ఎవరు మాత్రం వద్దంటారు. అయితే ఆ ఎవరు అనేది అసలు ప్రశ్న. మొత్తం ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని వినికిడి.

తారక్ చరణ్ విడివిడిగా ఒక్కొకరు మరో కీలక పాత్రలో ఇంకో బ్యూటీ ఉంటుందని తెలిసింది. సో లీడ్స్ ఎవరు అని తెలిసినా అభిమానులు కాస్త కుదుట పడతారు. కీర్తి సురేష్ కియారా అద్వానీ పేర్లు ముందు నుంచే ప్రచారంలో ఉన్నాయి. రాశి ఖన్నా పరిశీలనలో ఉందని అంటున్నారు. ఓ సీనియర్ ఆర్టిస్ట్ రోల్ కోసం ప్రియమణిని సంప్రదించినట్టు రెండు నెలల క్రితమే కథనం వచ్చింది. వీటన్నింటి నేపథ్యంలో అసలు ఫైనల్ గా తారక్ చరణ్ లతో ఎవరెవరు ఉంటారా అనే సస్పెన్స్ ఇంకా కొనసాగేలా ఉంది.


Full View

Tags:    

Similar News