శౌర్య మ‌ళ్లీ ఎందుకంత‌ రిస్క్?

Update: 2019-07-29 07:55 GMT
ఇటీవ‌ల టాలీవుడ్ హీరోల గాయాలు క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసిన సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా నాలుగు రోజులు న‌లుగురు హీరోల‌కు గాయాల‌య్యాయ‌న్న వార్తలు అభిమానుల్ని కంగారు పెట్టాయి. అయినా మ‌న హీరోలు సాహ‌సాలు మానుకున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. సెట్స్ లో రియ‌ల్ లైవ్ స్టంట్ల విష‌యంలో వెన‌క‌డుగు వేసేది లేద‌నేస్తున్నార‌ట‌.  

తాజాగా యువ‌హీరో నాగ‌శౌర్య అలానే మొండి ప‌ట్టు ప‌డుతున్నాడ‌ట‌. శౌర్య‌ మ‌రోసారి రియ‌ల్ లైవ్‌ స్టంట్స్ కి రెడీ అవుతున్నార‌ని తెలిసింది. ఇటీవ‌లే అత‌డు `అశ్వ‌త్థామ‌` సెట్స్ లో గాయ‌ప‌డినపుడు అభిమానులు కంగారు ప‌డ్డారు. నెల‌రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న అత‌డు కోలుకున్న వెంట‌నే మ‌ళ్లీ యాక్ష‌న్ కి రెడీ అయిపోవ‌డంపై ఫ్యాన్స్ ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటున్నారు. వైజాగ్ షూట్ లో ఓ రిస్కీ స్టంట్ చేస్తూ గాయ‌ప‌డిన అత‌డు ఆ విష‌యాన్ని మ‌ర్చిపోయి య‌థావిధిగా తాజా షెడ్యూల్లో పోరాట స‌న్నివేశాల్లో డూప్ లేకుండా న‌టించేయ‌బోతున్నాడ‌ట‌. ఈ యాక్ష‌న్ స‌న్నివేశాన్ని రామోజీ ఫిలింసిటీలో ప్లాన్ చేశారు.

తాజా చిత్రంలో శౌర్య స‌ర‌స‌న మెహ్రీన్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ర‌మ‌ణ తేజ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఎయిర్ టెల్ 4జీ గాళ్ స‌ర్గున్ కౌర్ ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది. నాగ‌శౌర్య సొంత బ్యాన‌ర్ ఐరా క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రిస్కీ ఫైట్స్ అంటే ఆలోచించాలి. మ‌రి శౌర్య దానిని ఖాత‌రు చేస్తున్న‌ట్టా లేదా?

    

Tags:    

Similar News