ఎర్ర చొక్కా తొడిగి హ్యాండ్ గన్ పట్టాడు.. ఉస్తాద్ ఏమా కథ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన `గబ్బర్ సింగ్` బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన `గబ్బర్ సింగ్` బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. కొన్ని వరుస పరాజయాల తర్వాత పవన్ కళ్యాణ్ కి బెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. హాస్యం, చతురత, రొమాన్స్, యాక్షన్ ఇలా అన్ని మసాలా అంశాలతో హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.
అందుకే ఈ జోడీ రిపీటవుతోంది అనగానే అభిమానుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బ్లాక్‌బస్టర్ గబ్బర్ సింగ్ తర్వాత, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కోసం దర్శకుడు హరీష్ శంకర్‌తో పవన్ మరోసారి చేతులు కలిపారు. ఈ సినిమా చిత్రీకరణను డిసెంబర్ చివరి నాటికి ముగించి నిర్మాణానంతర పనులను పూర్తి చేస్తున్నారు. ఈ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుందని నిర్మాతలు తాజాగా ధృవీకరించారు.
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన పోస్టర్‌లో పవన్ లుక్ ఆకట్టుకుంది. అందులో పవన్ కళ్యాణ్ ఒక వీధిలో నడుస్తూ తనదైన స్టైల్ లో యాటిట్యూడ్ ని చూపిస్తున్నాడు. భుజంపై హ్యాండ్‌గన్, చేతిలో పాతకాలపు క్యాసెట్ రేడియోతో ఉన్న ఈ లుక్ తిరిగి మరోసారి `గబ్బర్ సింగ్` వైబ్స్ ని రీక్రియేట్ చేస్తోంది. పాతకాలపు స్టైల్ తో కనిపిస్తున్నా కానీ, ఈసారి పవన్ మాఫియాను రౌడీలను డీల్ చేసే విధానం వేరే లెవల్ లో ఉంటుందని అర్థమవుతోంది. పవన్ ని ఇలా చూడగానే, ఎర్ర చొక్కా తొడిగి హ్యాండ్ గన్ పట్టాడు.. ఉస్తాద్ ఏమా కథ? అంటూ అభిమానులు ఉత్సాహంగా కామెంట్ చేస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన మొదటి పాట `దేఖ్ లెంగే` కొన్ని గంటల్లోనే లక్షలాది వ్యూస్ ని దక్కించుకుంది. దేవీశ్రీ స్వరపరిచిన ఈ పాట సినిమాపై పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా పవన్ కల్యాన్ స్టైలిష్ స్టెప్పులతో అలరించారు. పవర్ స్టార్ తన తదుపరి చిత్రాన్ని ఈ కొత్త సంవత్సరం వేళ ప్రకటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలిపారు