దిల్ రాజు రెండో పెళ్లి ఆలోచన ఎవరికి వచ్చింది?

Update: 2022-11-28 04:28 GMT
తెలుగు చిత్ర పరిశ్రమలో పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు బడా నిర్మాత దిల్ రాజు. నిర్మాతలకు పెద్దగా ఇమేజ్ లేని వేళ.. తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ తో పాటు.. నిర్మాతగా ఆయనకున్న పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాల్టి రోజుల్లో నిర్మాత అనే పదానికి గ్లామర్ తీసుకొచ్చిన వ్యక్తిగా దిల్ రాజును చెప్పాలి. ఆయన సినిమా అంటే.. సమ్ థింగ్ ఉండి ఉంటుందన్న నమ్మకం చాలామందిలో ఉంటుంది. అలాంటి దిల్ రాజు అసలు పేరు ఏమిటని అడిగితే చాలామంది తెల్లముఖం వేస్తారు. ఆయనకు సన్నిహితంగా ఉన్న వారు సైతం ఆయన అసలు పేరును చప్పున చెప్పలేరు.

అంతలా దిల్ రాజు అన్న పేరు స్థిరపడింది. ఇంతకూ దిల్ రాజు అసలు పేరేమిటంటే.. "వెంకట రమణా రెడ్డి" కానీ.. ఆయన్ను అందరూ ముద్దుగా రాజు అని పిలిచేవారు. ఆయన తీసిన మొదటి సినిమా దిల్ కావటంతో.. ఆయన్ను దిల్ రాజుగా పిలవటం మొదలుపెట్టి.. చివరకు ఆ పేరు స్థిరపడిపోవటమే కాదు.. ఇప్పుడు ఆ పేరు ఒక బ్రాండ్ గా మారిపోయిన పరిస్థితి. బడా నిర్మాతగా ఆయన పేరు తరచూ వార్తల్లో వస్తుంటుంది. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో తన ప్రొఫెషన్ గురించి మాత్రమే కాదు.. పర్సనల్ విషయాల్ని చెప్పుకొచ్చారు.
Read more!

ఆయన సతీమణి మరణించటం.. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకోవటం.. తాజాగా ఒక బాబుకు తండ్రి కావటం తెలిసిందే. రెండో పెళ్లి ఆలోచన ఎందుకు వచ్చింది? ఎవరికి వచ్చింది? రెండో పెళ్లి దిశగా అడుగులు ఎలా పడ్డాయి? లాంటి విషయాల్ని దిల్ రాజు మాటల్లోనే చెబితే.

"అనారోగ్యంతో ఆమె మరణించిన తర్వాత రెండేళ్ల పాటు ఇబ్బంది పడ్డా. భార్య పోయిన తర్వాత ఉండే న్యాచురల్ స్ట్రగల్స్ ఉంటాయి కదా? అలాంటి పరిస్థితే నాకు ఎదురైంది. ఆమె మరణించిన తర్వాత కూతురు.. అల్లుడు నాతోనే ఉన్నారు. నిర్మాత కాకుండా నాకున్న ఒకే ఒక్క వ్యాపకం గ్యాంబ్లింగ్ ఒక్కటే అలా ఉండిపోవటం సరైనది కాదని పేరెంట్స్ మాట్లాడటం మొదలు పెట్టారు.

దానికి నా కుమార్తె సపోర్టు చేసింది. క్లోజ్ ఫ్రెండ్స్ కూడా బాగా ఒత్తిడి చేశారు. అప్పటికినా వయసు 47 ఏళ్లు. తనది హైదరాబాదే. నా కుటుంబం.. ప్రొఫెషన్ డిస్ట్రబ్ కావొద్దని ఆవిడను అన్ని విధాలుగా ప్రిపేర్ చేసి పెళ్లాడాను. ఈ మధ్యనే మాకో బాబు పుట్టాడు. ఇద్దరు భార్యల పేర్లు వచ్చేలా 'అన్వయి' అన్న పేరు పెట్టాం" అని తన రెండో పెళ్లి విషయాల్ని వెల్లడించారు దిల్ రాజు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News