• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అజిత్‌ గొప్ప మనసుకు ఒక...

అజిత్‌ గొప్ప మనసుకు ఒక ఉదాహణ ఇది!

By - Tupaki Desk
Update: 2020-05-05 06:15 GMT
తమిళ స్టార్‌ హీరో అజిత్‌ సింప్లిసిటీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ అన్నట్లుగా ఉంటాడు. సూపర్‌ స్టార్‌ గా పేరు దక్కించుకున్నా కూడా ఇప్పటికి ఆయన లైఫ్‌ స్టైల్‌ చాలా సింపుల్‌ గా సాదా సీదాగా ఉంటుంది. బైక్‌ రైడ్‌ అంటే విపరీతంగా ఇష్టపడే అజిత్‌ ఇటీవల హైదరాబాద్‌ నుండి చెన్నై వరకు కూడా బైక్‌ రైడ్‌ ద్వారా వెళ్లిన విషయం తెల్సిందే. తాజాగా అజిత్‌ పుట్టిన రోజును అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రెట్‌ చేసుకున్నారు. లాక్‌డౌన్‌ ఉన్నా కూడా అభిమానులు మాత్రం సోషల్‌ మీడియా ద్వారానో లేదా మరో రకంగానో అజిత్‌ పుట్టిన రోజును జరుపుకున్నారు.

అజిత్‌ పుట్టిన రోజు సందర్బంగా 2013 సంవత్సరంలో జరిగిన ఒక సంఘటనను నటుడు సుహైల్‌ చందోక్‌ గుర్తు చేసుకున్నాడు. అజిత్‌ పుట్టిన రోజు సందర్బంగా మీ కోసం ఒక సర్‌ ప్రైజ్‌ ఫొటోను షేర్‌ చేస్తానంటూ సుహైల్‌ అన్నాడు. అన్నట్లుగానే ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన సుహైల్‌ ఆ ఫొటో వెనుక స్టోరీని చెప్పాడు.

వీరం సినిమా షూటింగ్‌ సమయంలో తలా అజిత్‌.. నేను కలిసి బైక్‌ పై లాంగ్‌ డ్రైవ్‌ వెళ్లాము. ఆ సమయంలో మేము ఒక చోట ఆగి టీ తాగాలనుకున్నాము. అప్పుడు ముమ్ములను గుడిసెలో నివసించే ఒక వ్యక్తి పిలిచాడు. అతడి కోరిక మేరకు మేము అక్కడకు వెళ్లి టీ తాగాము. ఆ తర్వాత వారు అజిత్‌ తో ఫొటో దిగాలనుకున్నారు. కాని వారు అడగలేక పోతున్నారు. ఆ విషయాన్ని గుర్తించిన అజిత్‌ వారితో ఫొటో దిగాడు. కుటుంబ సభ్యులందరితో అజిత్‌ ఫొటోను నేను దించాను. ఆ ఫొటోను ప్రింట్‌ తీయించి అజిత్‌ వారికి పంపించాడు.

ఈ సంఘటన అజిత్‌ ఎలాంటి వ్యక్తి అని చెప్పేందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆయన ఏం చేసినా కూడా చాలా సింపుల్‌ గా ఉంటుంది. ఆయన గొప్ప మనసున్న వ్యక్తి అంటూ సుహైల్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం అజిత్‌ గురించి సుహైల్‌ చెప్పిన మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అజిత్‌ ఫ్యాన్స్‌ ఈ పోస్ట్‌ ను తెగ రీ ట్వీట్స్‌ చేస్తూ తమ హీరో గొప్పతనంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Tags:    
  • When Thala Ajith voluntarily clicked a pic with a poor family 
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood Updates 
  • Kollywood Latest News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

పిల్లి కళ్ల భామకు వరుస అవకాశాలు..!

2026-11-03 17:54 GMT

Copyright @2026

Powered by Blink CMS