ర‌జ‌నీకాంత్ ని సూప‌ర్ స్టార్ కాద‌నేశాడు!

Update: 2020-10-24 05:15 GMT
ఒక సాధార‌ణ బ‌స్ కండ‌క్ట‌ర్ శివాజీ రావ్ గైక్వాడ్ సినీ ప్ర‌పంచంలో అంచెలంచెలుగా ఎదిగి సూప‌ర్ స్టార్ గా ఆవిష్క‌రించుకున్న తీరు అభిమానులంద‌రికీ స్ఫూర్తి. ఫ్యాన్స్ ర‌జనీకాంత్ ని దేవుడిగా కొలుస్తుంటారు. అయితే ఆయ‌న‌ను సూప‌ర్ స్టార్ కాద‌నేశారు బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్.

అలా ఏ సంద‌ర్భంలో అన్నారు? ఎందుకని అలా అనాల్సొచ్చింది? అంటే... ఓ ఆస‌క్తిక‌ర ఇన్సిడెంట్ ని అక్ష‌య్ గుర్తు చేశారు. అప్ప‌ట్లో బాబా సినిమాకి పంపిణీదారులంతా తీవ్రంగా న‌ష్ట‌పోయారు. ఆ స‌మ‌యంలో ర‌జ‌నీ ఏం చేస్తారా? అన్న‌ది లోకం చూస్తోంది. ఆయ‌న అంద‌రినీ పిలిచి డ‌బ్బు మొత్తం వెన‌క్కి ఇచ్చేశారు. హ్యాట్సాఫ్. ఒక స్టార్ అలా చేయ‌డం అన్న‌ది అరుదు. అందుకే ఆయ‌న సూప‌ర్ స్టార్ కాదు. అంత‌కుమించి! అని పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారు కిలాడీ అక్ష‌య్. ఆయ‌న స్టైల్స్ మ్యాన‌రిజం వేరొకరికి ఎప్ప‌టికీ సాధ్యం కావ‌ని ఇమ్మిటేట్ చేయ‌లేనివ‌ని కూడా కితాబిచ్చారు కిలాడీ. ఇదంతా త్రోబ్యాక్ మ్యాట‌రే అయినా ఆస‌క్తిని రేకెత్తించేదే.

2.0 రిలీజై డిజాస్ట‌ర‌యినా ఆ  సినిమా త‌న కెరీర్ లో మ‌ర‌పురానిద‌ని కిలాడీ అక్ష‌య్ కుమార్ గుర్తు చేసుకుంటారు. ఇందులో టెక్ లోకంపై క‌క్ష క‌ట్టే ప‌క్షిరాజుగా ప్ర‌తినాయ‌క పాత్ర‌లో అక్కీ అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న సంగ‌తి విధిత‌మే. ర‌జ‌నీ-అక్ష‌య్ మ‌ధ్య రోబోటిక్ ఫైట్స్ విన్యాసాలు ఆద్యంతం ర‌క్తి క‌ట్టించాయి. విజువ‌ల్ గ్రాఫిక్స్ 3డి మాయాజాలం ప్రేక్ష‌కుల్ని అబ్బుర‌ప‌రిచింది.

రజనీకాంత్- అక్ష‌య్ కుమార్ కీల‌క పాత్ర‌ల్లో నటించిన 2. 0 చిత్రం 2018 నవంబర్ 29 న విడుదలైంది. రజనీతో క‌లిసి తొలిసారి అక్షయ్ కుమార్ స్క్రీన్ స్పేస్ ని పంచుకున్నారు.  2.0 మేకింగ్ సమయంలో సూపర్ స్టార్ నుండి నేర్చుకున్న ప్రతిదానికీ తాను ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నానని అక్షయ్ అన్నారు. “రజని సార్,... తైలావర్ గురించి వివరించడానికి వినయ విధేయ‌తే సరైన పదం. మేం కలిసి ఒక వేదికపైకి వచ్చినప్పుడు ఆయ‌న‌ ప్రజలకు చెప్పిన మొదటి విషయం ఏమిటంటే,.. ‘ఇది నా సినిమా కాదు, ఇది అక్షయ్ సినిమా’ అని అన్నారు. కానీ ఇది ప్రతి బిట్ అతని చిత్రం అని అప్ప‌ట్లో అన్నారు అక్కీ. ఈ చిత్రం చేసినందుకు నాకు డబ్బు వచ్చింది. కానీ నాకు అంత‌కుమించిన‌ చాలా అనుభ‌వాల్ని నేర్పించినందుకు నేనే వారికి తిరిగి చెల్లించాలి. ఇది నా జీవితంలో నేను ఎప్పటికీ మరచిపోలేని అనుభవం అని అక్ష‌య్ ఎమోష‌న్ అయ్యారు.
Tags:    

Similar News