స్టార్ హీరో ఇంట్లో కాల్పులపై వర్మ మూవీ ఏమైంది?
మాఫియా కథలు అంటే చెవి కోసుకునే ఆర్జీవీకి మాఫియా నుంచి వార్నింగ్ అందిందా? అంటే అవుననే ఫిలింనగర్ కృష్ణానగర్ లో చెవులు కొరుక్కునే బాపతు చెప్పుకుంటున్నారు. ఇటీవల ఆర్జీవీ వరల్డ్ థియేటర్ అనే ఏటీటీ నెట్ వర్క్ ని ప్రారంభించి నానా రచ్చ చేస్తున్న క్రమంలో ఎన్నో వివాదాస్పద వాస్తవిక ఘటనలతో సినిమాల్ని తీస్తున్నారు. ఇవన్నీ లఘు చిత్రాలకు తక్కువ యూట్యూబ్ సినిమాలకు ఎక్కువ అన్న కామెంట్లు పడిపోతున్నా అతడి ప్రయత్నం మాత్రం ఆపలేదు.
ఏటీటీ వరల్డ్ లో తొలి అడుగు `పవర్ స్టార్` మూవీ. ఆ సినిమా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా.. తదుపరి అల్లు అనే మరో వివాదాస్పద చిత్రం ఏటీటీ కోసం తీస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ తెరమరుగవ్వడం వెనక అల్లు రాజకీయాన్ని తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నాడని గుసగుసలు వినిపించాయి. హైదరాబాద్ లో దిశా మరణం రేపిస్టుల ఎన్‌కౌంటర్ చుట్టూ ఓ కథను రెడీ చేసాడు. ఈ మూవీని గోవాలో చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో తొలి స్వలింగసంపర్క చిత్రమిదన్న చర్చా సాగుతోంది. ఇక హైదరాబాద్ లో కులాంతర వివాహం నేపథ్యంలో ప్రేమికుడి హత్య కథాంశంతో మర్డర్ మూవీని తీస్తున్న సంగతి తెలిసిందే. డాడీ మారుతీరావు కోణంలో అమృత- ప్రణవ్ లవ్ స్టోరి ఇది. అయితే పోలీస్ కేసులతో ఇది కాస్తా వాయిదా పడిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
అలాగే ప్రముఖ టాలీవుడ్ హీరో ఇంట్లో జరిగిన కాల్పుల ఘటనపైనా ఓ సినిమా తీసేందుకు స్క్రిప్టును రెడీ చేస్తున్నాడని లీకులు అందాయి. `ఆ రాత్రి ఎమైంది?` అనే టైటిల్ ని ఇప్పటికే రిజిస్టర్ చేయించారట. కానీ `ఆ రాత్రి ఏమైంది?` లాంటి సినిమా తీస్తే వర్మకు మూడినట్టేనని వార్నింగ్ అందిందట. దీంతో ఆ సినిమాని తెరకెక్కించేందుకు వెనకాడుతున్నారన్న ప్రచారం సాగిపోతోంది. కేసులు వివాదాలు ఉన్నప్పుడు కొంత గ్యాప్ ఇచ్చి వాటిని తిరిగి తెరపైకి తేవడం ఆర్జీవీకి అలవాటు వ్యాపకమే. అయితే దీని పై ఆర్జీవీ స్వయంగా వివరణ ఇవ్వాల్సి ఉంది. గోవా బీచ్ నుంచి ఆయన రెస్పాండ్ అవుతారేమో చూడాలి.