స్విమ్ సూట్ లో దేవియాని శర్మ.. హాట్ లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా!
నిత్యం గ్లామర్ వలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ చిన్నది.. గత కొంతకాలంగా మరింత హాట్ డోస్ పెంచేసి ఊరిస్తున్న విషయం తెలిసిందే.;
సామాజిక మాధ్యమాల ఉపయోగం ఈ మధ్యకాలంలో భారీగా పెరిగిపోయింది. అటు సినీ సెలబ్రిటీలైనా ఇటు సామాన్యులైనా కాస్త సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో దూరిపోతూ భిన్నమైన కంటెంట్ ఇస్తూ పాపులారిటీ సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలే సినిమాల ద్వారా క్రేజ్ దక్కడం కష్టంగా మారుతున్న వేళ ఇటు సోషల్ మీడియాలో ఈజీగా పాపులారిటీని సంపాదించుకోవచ్చు అనే నెపంతో అందాలు ఆరబోస్తూ ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు.
గ్లామర్ వలకబోస్తూ ఆడియన్స్ ను అలరించడమే కాకుండా ఇటు నెటిజన్స్ ను ఫాలోవర్స్ గా మార్చుకుంటూ అత్యధిక ఫాలోవర్స్ కలిగిన సెలబ్రిటీల జాబితాలో చేరిపోతున్నారు. అంతేకాదు ఈ సోషల్ మీడియా వేదికగా ఆదాయాన్ని కూడా పెంపొందించుకుంటున్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలలో మరొకవైపు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటూ అందర్నీ అలరిస్తున్న సెలబ్రిటీలలో సేవ్ ది టైగర్స్ బ్యూటీ దేవియాని శర్మ కూడా ఒకరు.
నిత్యం గ్లామర్ వలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ చిన్నది.. గత కొంతకాలంగా మరింత హాట్ డోస్ పెంచేసి ఊరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరొకసారి అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. తాజాగా సముద్రపు ఒడ్డున బండరాళ్ల మధ్యలో ఫోటోలకు ఫోజులిస్తూ ఈమె షేర్ చేసిన ఈ పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇకపోతే స్విమ్ సూట్ లో అందాలు ఆరబోస్తూ దేవియాని శర్మ ఫోటోలు షేర్ చేయడమే కాకుండా.."నీరు నా గాయాలను కడుగుతుంది. సముద్రం నా రంగులను ముద్దాడుతుంది. ప్రేమ అంతులేనిది. స్వేచ్ఛగా అనిపించే చోటు.. సముద్రంలోనే నేను నా నిజస్వరూపాన్ని కనుగొంటాను " అంటూ క్యాప్షన్ కూడా జోడించింది.
ఎప్పటికప్పుడు సముద్ర తీరాన అందాలు ఆరబోస్తూ షేర్ చేసే ఈమె ఇప్పుడు మరొకసారి స్విమ్ సూట్ లో అందాలు ఆరబోస్తూ తనను తాను మైమరిచిపోయి అందరిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక దేవియాని శర్మ విషయానికి వస్తే.. 1993 మే30న న్యూఢిల్లీలో సునీల్ శర్మ, నీనా శర్మ దంపతులకు జన్మించింది. ఈమెకు సోదరి సోనమ్ శర్మ కూడా ఉంది.టీనేజ్ లో ఉన్నప్పుడే మోడలింగ్ వైపు వెళ్లిన దేవియాని నటనపై ఆసక్తితో కొన్ని నాటకాలలో కూడా నటించింది . ఇక తొలిసారి 2020లో రొమాంటిక్ ప్రేమ కథ చిత్రం గా వచ్చిన భానుమతి అండ్ రామకృష్ణ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె రొమాంటిక్ అనే చిత్రంలో నటించిన ఈమె.. ఆ తర్వాత అనగనగా , సేవ్ ది టైగర్స్ , సైతాన్, నేమ్ ఆఫ్ గాడ్ వంటి వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. ఇకపోతే ఈమెకు మాత్రం సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ మంచి పేరును అందించిందని చెప్పవచ్చు. ఇక తన నటన ప్రయాణాన్ని మాత్రం హిందీ చిత్రం లవ్ శుదాలో చిన్న పాత్రతో హిందీ ప్రేక్షకులను పలకరించింది.