స్టార్ హీరోతో రొమాంటిక్ ఫోజులిస్తున్న పూజా హెగ్డే.. ఫోటో వైరల్!

బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వరుణ్ ధావన్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సరికొత్త చిత్రం "హై జవానీ తో ఇష్క్ హోనా హై".;

Update: 2026-04-07 14:07 GMT

బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వరుణ్ ధావన్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సరికొత్త చిత్రం "హై జవానీ తో ఇష్క్ హోనా హై". "ప్రేమ ఒక్కసారే పుడుతుంది" అనే ఆసక్తికరమైన థీమ్‌తో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. రొమాంటిక్ కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన డేవిడ్ ధావన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి వస్తున్న క్రేజీ అప్‌డేట్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి..ఆ విశేషాలు చూద్దాం..




 


వైరల్ అవుతున్న పిక్స్:

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో శరవేగంగా జరుగుతోంది. అక్కడ గంగానది తీరంలో వరుణ్, పూజాలపై కొన్ని రొమాంటిక్ సీన్లను చిత్రీకరిస్తున్నారు. తాజాగా విడుదలైన బిహైండ్ ది సీన్స్ లో వీరిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. ఒక సీన్‌లో పూజా స్విమ్‌సూట్‌లో కనిపించగా, వరుణ్ వైట్ షర్ట్, బ్లాక్ షార్ట్ లో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. వీరిద్దరూ బీచ్ ఒడ్డున చేసిన రొమాంటిక్ సిన్, ఆన్-సెట్ పిక్స్ చూస్తుంటే సినిమాలో రొమాన్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతోందని అర్థమవుతోంది.

భారీ తారాగణం.. జూన్‌లో థియేటర్లలో సందడి:

ఈ సినిమాలో కేవలం పూజా హెగ్డే మాత్రమే కాదు, టాలెంటెడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా మరో కీలక పాత్రలో మెరవనుంది. వీరితో పాటు మనీష్ పాల్, జిమ్మీ షెర్గిల్, మౌనీ రాయ్, చుంకీ పాండే వంటి భారీ తారాగణం ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. జూన్ మొదటి వారం లో ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 2026 ప్రథమార్థంలోనే టీజర్లు, పాటలు విడుదల చేసి సినిమాపై హైప్‌ను మరింత పెంచాలని చిత్రబృందం భావిస్తోంది.

తండ్రీకొడుకుల హ్యాట్రిక్ మ్యాజిక్:

వరుణ్ ధావన్ తన తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వంలో చేస్తున్న మూడవ సినిమా ఇది. గతంలో వీరి కాంబోలో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు పూజా హెగ్డేతో కలిసి వరుణ్ చేస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. ముఖ్యంగా రిషికేశ్ షెడ్యూల్ ముగియడంతో ఫ్యాన్స్ ఇప్పుడు అఫీషియల్ టీజర్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి ఈ 'హై జవానీ' తో వరుణ్ ఎలాంటి ఇష్క్ చేస్తాడో చూడాలంటే జూన్ వరకు ఆగాల్సిందే!

Tags:    

Similar News