ఒంటికన్ను రాక్షసుడితో విశ్వంభ‌ర ఫైట్!

అయితే ఈ మూవీ గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది.;

Update: 2026-04-07 13:40 GMT

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ సోషియో ఫాంటసీ సినిమా విశ్వంభ‌ర ఇప్పుడు విడుదల ఆలస్యం కారణంగా మళ్లీ వార్తల్లో నిలిచింది. వ‌శిష్ట‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. విజువల్ గ్రాండియర్‌తో పాటు ఫాంటసీ ఎలిమెంట్స్‌ను కలిపి ఈ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వబోతోందని చిత్రబృందం ముందుగానే సంకేతాలు ఇచ్చింది.

వీఎఫ్ఎక్స్ కార‌ణంగానే ఆల‌స్యం

ప్రస్తుతం ఈ సినిమాపై ప్రధాన చర్చ వీఎఫ్ఎక్స్ పనుల ఆలస్యం గురించే. షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయినప్పటికీ, భారీ స్థాయిలో కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ ఉండటం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ దశ ఎక్కువ కాలం తీసుకుంటోంది. అయితే ఈ మూవీ గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. విశ్వంభ‌ర మూవీలో మెగాస్టార్, ఒంటిక‌న్ను రాక్ష‌సుడితో ఫైట్ చేయ‌నున్నార‌ని, వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగే పోరాట స‌న్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను హాలీవుడ్ స్థాయిలో రూపొందించార‌ని, అదే సినిమాలో ప్రధాన ఆకర్షణగా మారనుందని చెబుతున్నారు.

ఇక ఈ సినిమా రిలీజ్ విషయానికి వస్తే, మొదట విశ్వంభ‌ర‌ను సమ్మర్‌లో విడుదల చేయాలని భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా సమ్మర్ రేస్ నుంచి కూడా తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కన్నా తరువాత ప్రారంభమైన మ‌న శంక‌ర‌వ‌రప్ర‌సాద్ గారు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచినప్పటికీ, విశ్వంభర మాత్రం ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే ఉండటం గమనార్హం.

ఇక సంగీతం విష‌యానికొస్తే ఈ సినిమాకు ఎం.ఎం కీర‌వాణి సంగీతం అందిస్తుండ‌గా, ఆయ‌న సంగీతం ఈ ఫాంట‌సీ ప్ర‌పంచానికి మ‌రింత బ‌లాన్ని చేకూర్చ‌నుంద‌ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. యువీ క్రియేష‌న్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా టెక్నిక‌ల్ గా కూడా అత్యున్న‌త ప్ర‌మాణాల‌తో రూపొందుతుంది. మొత్తంగా చూస్తే, విశ్వంభర ఒక సాధారణ మైథాలజికల్ సినిమా కాకుండా, ఫాంటసీ, యాక్షన్, విజువల్ గ్రాండియర్ కలిసిన భారీ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోంది. రిలీజ్ డేట్‌పై ఇంకా స్పష్టత లేకపోయినా, ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రత్యేకంగా మెగాస్టార్‌ను కొత్త అవతారంలో చూడాలని అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు.

Tags:    

Similar News