మంచు విష్ణు వద్ద ఉన్న ఆ సీక్రెట్ ఆడియో టేప్‌ ఏంటీ?

Update: 2021-03-14 23:52 GMT
కమర్షియల్‌ సక్సెస్‌ కోసం సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న మంచు విష్ణు ఈ వారం 'మోసగాళ్లు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మంచు విష్ణు రెగ్యులర్ సినిమాల మాదిరిగా కాకుండా ఈ సినిమా విభిన్నంగా ఉంటుంది. విష్ణు ఈ సినిమా లో హీరోగా కనిపించడు అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. మొదటి నుండి ఈ సినిమాపై జనాల్లో పెద్దగా ఆసక్తి లేదు. కాని ఎప్పుడైతే సినిమా ట్రైలర్‌ ను విడుదల చేసి ప్రచారం మొదలు పెట్టారో అప్పటి నుండి సినిమా పై అంచనాలు పెరిగి పోయాయి. మోసగాళ్లు సినిమా గురించి చర్చించుకోవడం మొదలు పెట్టారు. ఈ సమయంలో మంచు విష్ణు చేసిన ఒక ప్రకటన సినిమా గురించి మరింతగా చర్చ జరిగేలా చేసింది.

మోసగాళ్లు సినిమా పబ్లిసిటీ లో భాగంగా నవదీప్ తో కలిసి మంచు విష్ణు ప్రెస్ మీట్‌ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా ఎక్కువ మంది చూసి అభినందించేలా ఉంటుంది. తప్పకుండా దీన్ని ప్రేక్షకులు ఆధరిస్తారనే నమ్మకం ఉంది. టెక్నాలజీతో మోసం చేసే సినిమా అయినా కూడా ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలా తీసినట్లుగా చెప్పుకొచ్చాడు. అక్కా తమ్ముడు కలిసి చేసిన ఓ స్కామ్‌ నేపథ్యం ఈ సినిమా. ఇందులో అంశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

ఈ సినిమా తీస్తున్న క్రమంలో స్కామ్‌ కు సంబంధించిన కొందరు వ్యక్తులు నాకు ఫోన్‌ చేశారు. ఆ ఫోన్‌ కాల్‌ ఆడియో ను ప్రీ రిలీజ్ వేడుక సందర్బంగా వినిపిస్తాను అన్నాడు. ఇంతకు ఆ ఆడియో టేప్ లో ఏమి ఉండి ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. మంచు విష్ణును ఆ ఆడియోలో బెదిరించారా లేదంటే స్కాం కు సంబంధించిన విషయాలను వెళ్లడించి ఉంటారా అనేది చూడాలి. కాజల్‌ మరియు విష్ణు లు అక్క తమ్ముడి పాత్రలో నటించిన ఈ సినిమా ఈనెల 19న రిలీజ్ కాబోతున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి మరియు టాలీవుడ్ నటుడు నవదీప్ లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
Tags:    

Similar News