'యమదొంగ' తో తెల్లవారితే గురువారానికి ఉన్న సంబంధమేంటి..?
'మత్తు వదలరా'తో హీరోగా పరిచయమైన సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి కుమారుడు శ్రీ సింహా కోడూరి హీరోగా నటిస్తున్న రెండో సినిమా ''తెల్లవారితే గురువారం''. మణికాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మిషా నారంగ్ - చిత్రా శుక్లా కథానాయికలుగా నటిస్తున్నారు. సాయి కొర్రపాటి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం - లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రజని కొర్రపాటి - రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్చి 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించబోయే రిలీజ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ - దర్శకధీరుడు రాజమౌళి చీఫ్ గెస్టులుగా హాజరు కానున్నారు.
రేపు మార్చి 21 సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్ జేఆర్‌సీ కన్వెన్షన్ లో ‘తెల్లవారితే గురువారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు. దీనికి అతిధులుగా వస్తున్న తారక్ - జక్కన్న లకు వెల్కమ్ చెబుతూ ఓ స్పెషల్ త్రో బ్యాక్ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 2013లో ఎన్టీఆర్ - రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన 'యమదొంగ' సినిమాతో ఈ చిత్రానికి ఉన్న సంబంధం గురించి తెలియజేసారు. ఈ చిత్రంలో చిన్నప్పటి ఎన్టీఆర్ గా శ్రీ సింహా నటించాడు. ఈ నేపథ్యంలో 'యమదొంగ' సినిమా కోసం వర్క్ చేసిన ఈ ముగ్గురూ.. ఇప్పుడు ఒకే వేదికను పంచుకోబోతున్నారని తెలిపారు. 'యమదొంగ'లోని ఇంట్రడక్షన్ సీన్ తో ఎన్టీఆర్ కి స్వాగతం పలికారు. ఇకపోతే ఈ చిత్రానికి కీరవాణి పెద్ద కొడుకు కాళభైరవ సంగీతం సమకూరుస్తున్నారు. సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. సత్య ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. రాజీవ్ కనకాల - సత్య - అజయ్ ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషించారు.
https://twitter.com/Simhakoduri23/status/1373193996990697475?s=19