విరుష్క జంట‌పై బిగ్ బి జోక్ మీనింగ్ ఏమిటో?

Update: 2021-04-04 05:42 GMT
విరుష్క జంట‌పై బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ జోక్ అభిమానుల్లో హాట్ డిబేట్ గా మారింది. అనుష్క శర్మ- విరాట్ కోహ్లీపై అమితాబ్  ఇన్ స్టా జోక్ తో పాటు ఆయ‌న షేర్ చేసిన ఫోటో వైర‌ల్ గా మారాయి. విరుష్క జంట‌కు అమితాబ్ గౌర‌వం ఇస్తూనే పోయెటిక్  జోక్ ని పోస్ట్ చేయ‌డం ఆస‌క్తిక‌రం. దానర్థం ఇలా ఉంది.

``రంగ్ అభి తక్ ఉతారా నహిన్.. ఔర్  తయోహర్ కే చుట్కులే బ్యాండ్ నహీ హ్యూ (హోలీ రంగులు ఇంకా కడిగేయ‌లేదు .. పండుగ జోకులు అయిపోలేదు)`` అంటూ పోయెటిక్ గా జోక్ ని పోస్ట్ చేశారు. రంగురంగుల రంగుల మిశ్ర‌మం నిండిన స్వెట్ ష‌ర్ట్ ధరించిన అమితాబ్ తన చిత్రాన్ని పోస్ట్ చేస్తూ జోక్ ‌ను జోడించారు. దీనికి నెటిజ‌నుల నుంచి స్పంద‌న ఆక‌ట్టుకుంటోంది.

అనుష్క - విరాట్ 2017లో పెళ్లితో ఒక‌ట‌య్యారు. ఇటీవల తమ మొదటి బిడ్డ కుమార్తె వామికకు స్వాగతం పలికారు. అనుష్క‌.. అమితాబ్ త‌దుప‌రి రిలీజ్ కి రానున్న మూవీలో కొలీగ్స్ అన్న సంగ‌తి తెలిసిన‌దే.

అమితాబ్ కెరీర్ సంగ‌తి చూస్తే... అయాన్ ముఖర్జీ ప్రతిష్టాత్మక ఫాంటసీ త్రయం బ్రహ్మస్త్రా చిత్రంలో అమితాబ్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్- అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించారు. మౌని రాయ్- నాగార్జున కూడా ఈ చిత్రంలో కనిపించనున్నారు.

కోవిడ్ -19 వ్యాక్సిన్ మొదటి మోతాదు తీసుకున్న తరువాత అమితాబ్ ఏక్తా కపూర్ `గుడ్ బాయ్` చిత్రంలో న‌టించేందుకు రెడీ అయ్యారు.  అమితాబ్ తన అనుభవాన్ని పంచుకునేందుకు శుక్రవారం ఉదయం తన బ్లాగ్ లోకి వెళ్లారు. వికాస్ బహ్ల్ దర్శకత్వంలో బాలాజీ టెలిఫిల్మ్స్ అండ్ రిలయన్స్ ఎంటర్ టైర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 ఈ చిత్రంలో అమితాబ్,.. రష్మిక మండన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గత వారం ముంబైలో లాంచ‌నంగా సినిమా మొద‌లైంది. రష్మిక ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిందని నేటి (ఏప్రిల్ 4 ఆదివారం)  నుంచి అమితాబ్ సెట్స్ లో చేరుతున్నార‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News