#రెడ్.. రామ్ మోసుకెళుతున్న ఆ సీక్రెట్ వెప‌న్ ఏమిటి?

Update: 2020-12-24 06:54 GMT
ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇస్టైల్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. టాలీవుడ్ లో స్మార్ట్ హీరోగా అత‌డికి ఉన్న గుర్తింపు వేరు. అన్నిటినీ మించి మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వ‌ర్గాల్ని ఆక‌ట్టుకునే అరుదైన ప్ర‌తిభావంతుడిగా రామ్ ని అభిమానిస్తారు.

ఇక ఇటీవ‌ల రామ్ 6 ప్యాక్ యాబ్స్ టోన్డ్ బాడీతో యువ‌తుల మ‌తులు చెడగొడుతున్నాడు. టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ స్టైలిష్ బ్యాచిల‌ర్ కావ‌డంతో మ‌గువ‌ల క‌ళ్ల‌న్నీ అత‌డిపైనే ఉన్నాయి మ‌రి. ఇలాంటి టైమ్ లో రామ్ న‌టించిన రెడ్ రిలీజ్ కి వస్తోంది. ఇందులో అత‌డు ద్విపాత్రాభిన‌యం చేయ‌డ‌మే గాక గ‌డ్డంతో ర‌ఫ్ గా క‌నిపిస్తుంటే షో మ్యాన్ లా గుబులు పెంచేస్తున్నాడు.

తాజాగా రామ్ క‌మిట్ మెంట్ ఒక‌టి కెమెరా కంటికి లీకైంది. అత‌డు ఎప్పుడూ త‌న‌తో ఒక  ఒక ఎక్సర్ సైజుల బార్ ని తీసుకుని వెళుతున్నాడు. రంగురంగుల బాక్స్ లా ప్ర‌కాశ‌వంతంగా క‌నిపిస్తూ అది అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఇంత‌కీ అదేమిటి? అన్న‌ది ఆరా తీస్తే..

జిమ్ లో వ్యాయామం ముగించి వ‌చ్చేప్పుడు ఇది రామ్ తీసుకుని వ‌స్తున్నారు. ఈ ప్రత్యేకమైన సాధనం 9-ఇన్ -1 బాడీబిల్డింగ్ పుష్-అప్ ర్యాక్ బోర్డు. ఇది 200 కిలోల బరువును అవ‌లీల‌గా మోసేస్తుంద‌ట‌. వేర్వేరు రంగుల‌-కోడెడ్ పుష్-అప్ బోర్డు నిర్దిష్ట కండరాలపై ఎంతో ప్ర‌భావ‌వంతంగా పని చేస్తుంది. నీలం- ఛాతీపై.. ఎరుపు-భుజాలపై.. ఎల్లో-బ్యాక్ వైపు..  గ్రీన్ - ట్రైసెప్స్ కోసం.. ఉప‌యోగిస్తార‌ట‌. ఈ సాధనం మొత్తం-శరీర బలం కండిషనింగ్ వర్కౌట్ ‌లకు స‌హ‌క‌రిస్తుంది.  

రామ్ ప‌ట్టుద‌ల చూస్తుంటే బాడీ బిల్డింగ్ విష‌యంలో ఎక్క‌డా త‌గ్గేట్టు క‌నిపించ‌డం లేదు. తన ప్రత్యేక సాధనంతో కొన్ని తీవ్రమైన వ్యాయామాలపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. అతను జిమ్ లోనే కాదు జిమ్ వెలుప‌లా క‌ఠినంగా సాధ‌న చేస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. రామ్ న‌టించిన‌ RED సంక్రాంతి కానుక‌గా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా రిలీజైన ట్రైల‌ర్ ఫ‌న్ స‌ర్కాస్మ్.. యాక్ష‌న్ థ్రిల్స్ తో అద‌ర‌గొట్టింద‌న్న టాక్ వినిపిస్తోంది.
Tags:    

Similar News