సాహో బ్యూటీ మిస్సింగ్ చివరికి ఎక్కడ తేలిందంటే..!
సాహో ఫేం శ్రద్ధా కపూర్ ఇటీవల కొంతకాలంగా రకరకాల కారణాలతో హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్ రోహన్ శ్రేష్టను పెళ్లాడేందుకు సిద్ధమవుతోందన్న ప్రచారం కూడా ఉంది. కానీ దీనిపై తాజా అప్ డేట్ ఏదీ లేదు. ప్రస్తుతం శ్రద్ధా మిస్సింగ్ అంటూ ప్రచారమవుతోంది. దానికి కారణం లేకపోలేదు.
ఈ భామ ఇటీవలే `చిచోర్` ఉత్తమ చిత్రం కేటగిరీలో జాతీయ అవార్డును అందుకోవడంతో ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. తన సినిమా ఉత్తమ చిత్రంగా నిలవడంతో కథానాయకుడిని తలుచుకుని విషాదం వ్యక్తం చేసింది. దివంగత యువహీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను ఈ సందర్భంగా శ్రద్ధా అండ్ టీమ్ సంస్మరించుకున్నారు. శ్రద్ధ సహా చిత్రబృందం ఈ అవార్డును సుశాంత్ కి అంకితం ఇచ్చారు.
శ్రద్ధా కెరీర్ మ్యాటర్ కి వస్తే.. రణబీర్ కపూర్ సరసన శ్రద్ధా ఓ చిత్రంలో నటిస్తోంది. తాజా షెడ్యూల్ ను పూర్తి చేసి కాస్త తీరిక సమయం చిక్కగానే మాల్దీవులకు పయనమైంది. అక్కడ శ్రద్ధా సెలబ్రేషన్ ఎలా ఉందో ఇదిగో ఈ ఫోటోనే ఎగ్జాంపుల్.
మంగళవారం ఉదయం శ్రద్ధా తన రోజువారీ ఫ్రూట్ డైట్ ని ప్రిపేర్ చేసిందిలా. పండ్ల మోతాదును కాస్త ఎక్కువగానే ప్రేమిస్తుందని తన ముందు ఉన్న ఆ సలాడ్లు చెబుతున్నాయి. తన ముందు పళ్లెంలో డ్రాగన్ ఫ్రూట్.. లాంగన్.. పింక్-ఫ్లెష్డ్ గువా ..మాంగోస్టీన్ తో మిక్స్ డ్ ఫ్రూట్ ఉంది. `ఐలాండ్ ఫ్రూట్ లవింగ్` అంటూ ఈ ఫోటోకి శ్రద్ధా క్యాప్షన్ ఇచ్చింది. లాంగన్ అనేది లీచీ లాంటి పండు. ఇది చాలా గుజ్జు తో తీపిగా ఉంటుంది. మాంగోస్టీన్ ని పండ్ల జాతిలో రాణి అని కూడా పిలుస్తారు. ఇది ఉష్ణమండల పండు. ఇది బయటికి ఊదా రంగులో ఉంటుంది. కానీ లోపల జ్యుసీగా మీటీగా ఉంటుంది. ఇది కొద్దిగా తీపి పులుపుతో ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు ఫైబర్ మరియు ఖనిజాల మిశ్రమాన్ని కలిగి ఉంటుంది.. అంటూ శ్రద్ధా బోలెడంత క్లాస్ తీస్కుంది. ఉదయం అల్పా హారంగా రొట్టెలను కూడా శ్రద్ధా తీసుకుంటుందట.